తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్‌.ర‌మ‌ణ‌?!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మ‌రో కోలుకోలేని ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగ‌నుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్‌ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపార‌ట‌. […]

భ‌లే విచిత్రం.. ప్ర‌తిప‌క్ష‌నేత‌కు మంత్రి బ‌హిరంగ‌లేఖ‌

ఎక్క‌డైనా స‌రే అధికార పార్టీకి, మంత్రుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు లేఖ‌లు రాయ‌డం, విజ్ఞ‌ప్తులు చేయ‌డం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం మంత్రినే ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ లేఖ రాసింది ఎవ‌రంటే తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, మ‌రి ఎవ‌రికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. […]

ఈట‌ల భూక‌బ్జాలో కొత్త ట్విస్ట్‌.. హైకోర్టుకు రైతులు!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉదంతంలో వెలుగులోకి వ‌చ్చి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌ గ్రామ భూముల వివాదంలోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూముల స‌ర్వేను అడ్డుకోవాల‌ని వారు డిమాండ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జాతో వెలుగులోకి వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వం దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌పై దృష్టి సారించింది. న‌లుగురు ఐఏఎస్‌ల‌తో ప్ర‌త్యేక […]

ఈట‌లపై ఎన్నారైల ఆగ్రహం..!

మాజీమంత్రి, టీఆర్ ఎస్ తిరుగుబాటు నేత ఈటెల రాజేంద‌ర్ వ్యవహారంపై అమెరికా ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్ల ఎన్నారైలు చర్చించి స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమన్నారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు […]

మేయ‌ర్ నియామ‌కానికి టీఆర్ ఎస్ ప‌రిశీల‌కులు వీరే..!

ఇటీవ‌ల జ‌రిగిన రెండు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ త‌ర‌పున పరీశీలకుల పేర్ల‌ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల […]

కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

ఈట‌ల స్థానంలో వ‌రంగ‌ల్ నేత‌కు మంత్రి ప‌ద‌వి..!

భూక‌బ్జా వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద నుంచి వైద్య ఆరోగ్య‌శాఖల‌ను త‌ప్పించారు. వాటిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నారు. రాజేంద‌ర్‌ను కేవ‌లం శాఖ‌లు లేని మంత్రిగానే కొన‌సాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బ‌హిష్క‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, రాజ‌కీయ అడుగుల గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపిన ఈట‌ల షామిర్‌పేట‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డే త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు […]

అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!

బీజేపీ అస్సాంలో విజ‌యం దిశ‌గా ప‌రుగులు తీస్తున్న‌ది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్య‌త‌ను చాటుకుంటున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాల‌కు ఎగ‌బాకింది. అక్క‌డి అధికార టీఎంసీ పార్టీకి స‌వాల్‌గా నిలిచింది. ఇంత‌గా యావ‌త్ భార‌తదేశ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డిపోయింది. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారి పోయింది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మూడుస్థానంలో కొన‌సాగుతుండ‌గా అక్క‌డ కేవ‌లం 15వేల ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది. […]

సాగ‌ర్‌లో విజ‌యం దిశ‌గా టీఆర్ ఎస్‌..!

న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. ఎనిమిదో […]