జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ […]

సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]

’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు […]

నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం..!

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రాజకీయ నాయకులు జిల్లాలో పట్టుకోసం పోరాడుతున్నారు. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలసులు బుధవారం అరెస్టు చేశారు.. ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం చౌటుప్పల్ లో  రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.అయితే ఈ అధికారిక కార్యక్రమానికి […]

ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !

హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ  సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం. ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని […]

రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]

ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]