బ్లాక్ ఫ్రాక్‌లో మ‌తిపోగొడుతున్న ప్రియ‌మ‌ణి..ఫొటోలు వైర‌ల్‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం ఈమె విరాటపర్వం, నారప్ప చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి మైదాన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే హిజ్ స్టోరీ అనే […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ పాత్ర ఏంటో తెలుసా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నార‌ని ఎప్ప‌టి […]

సునీల్‌ను వ‌ద‌ల‌ని త్రివిక్ర‌మ్‌..ఈసారైనా స‌క్సెస్ అయ్యేనా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సునీల్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. క‌మెడియ‌న్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. హీరోగా మారాడు. అయితే ఈ మ‌ధ్య కెరీర్ బాగా డ‌ల్ అయిపోయివ‌డంతో.. మ‌ళ్లీ కామెడీ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల మీద దృష్టి పెట్టాడు. అయిన‌ప్ప‌టికీ […]

అఖిల్ కోసం చిరు డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టిన‌ నాగ్‌?

నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్‌. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం […]

`ఆదిపురుష్` కోసం రంగంలోకి మ‌రో బాలీవుడ్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మ‌రో బాలీవుడ్ న‌టుడిని రంగంలోకి […]

ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్` ముందు ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో ఇటీవ‌ల రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. మొద‌ట ఈ రీమేక్ చిత్రం ప‌వ‌న్ […]

బ‌తికే ఉన్నా..మ‌ర‌ణ వార్త‌ల‌పై స్పందించిన ప్ర‌ముఖ‌ న‌టుడు!

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు పరేష్ రావల్ మృతి చెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. శుక్ర‌వారం ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు వైర‌ల్ అయ్యాయి. దీంతో నెటిజ‌న్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కామెంట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశారు. అయితే ఈ వార్త ప‌రేష్ రావ‌ల్ చెంత‌కు చేర‌డంతో.. ఆయ‌న నవ్వుకోవడమే కాకుండా ట్విట్టర్ వేదికగా చమత్కారంగా రియాక్ట్ అయ్యారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించాలి.. నేను బ‌తికే […]

హ‌న్సిక 50వ‌ సినిమాకు అడ్డంకులు..ద‌ర్శ‌కుడే అలా చేశాడ‌ట‌!

హ‌న్సిక 50వ చిత్రం మ‌హా. జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో హ‌న్సిక మాజీ ప్రియుడు శింబు కూడా కీల‌క పాత్ర పోషించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కింది. మంచి అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇంత‌లోనే దర్శకుడు జ‌మీల్ మాత్రం సినిమా […]

నెటిజ‌న్ల తీరుకు రేణూ దేశాయ్‌ తీవ్ర ఆవేద‌న‌..ఏం జ‌రిగిందంటే?

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌శ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌ రూపంలో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వ‌ల్ల ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ముఖ్యంగా హాస్ప‌ట‌ల్స్ లో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ […]