పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ రీమేక్ చిత్రం పవన్ వద్దకు వెళ్లలేదట. నిర్మాత దిల్ రాజు ముందుగా ఈ చిత్రం కోసం నందమూరి బాలకృష్ణకు సంప్రదించారట.
అయితే బాలయ్య మాత్రం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. అదే సమయంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలుసుకున్న త్రివిక్రమ్.. ఆ విషయాన్ని పవన్‌కళ్యాణ్‌కు చేరవేశారట. కథ నచ్చడంతో పవన్ వెంటనే ఓకే చెప్పారని.. దాంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.