రెండేళ్ల నుంచి అన్ని విషయాల్లో పైచేయి సాధించిన టీఆర్ ఎస్ ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే 8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని దెబ్బమీద దెబ్బగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ నిశితంగా పరిశీలించి, నిఘాలతో ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తోన్న ప్రభుత్వం, ఎంసెట్ లీకేజీ అంశంలో దెబ్బతిన్నమాట నిజమేనని ఎమ్మెల్యేలు, నేతలు అంగీకరిస్తున్నారు. ఎంసెట్ కుంభకోణం లక్షలాది […]
Tag: Telangana
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాము. అలాగే ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైతే మళ్ళీ పరీక్ష రాయడం అనేది కష్టసాధ్యం. విద్యార్థి లోకం పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎందర్నో చూస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని తెలంగాణ సిఐడి స్పష్టం చేయడంతో ఇంకోసారి ఎంసెట్ నిర్వహణ జరుగుతుందనే ప్రచారం కారణంగా విద్యార్థి […]
కడియం శ్రీహరికి చెక్ పెడ్తారా?
తెలంగాణలో ఎంసెట్ వివాదాస్పదమయ్యింది. నీట్ పరీక్ష కారణంగా ఎంసెట్-1, ఎంసెట్-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్ అభ్యర్థులు. అయితే ఎంసెట్-2 లీక్ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్-2లో ర్యాంకులు పొందారు. పేపర్ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]
కెసియార్ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్ సహా టిఆర్‌ఎస్ నాయకులు నినదించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు […]
కార్నర్ అయ్యింది హరీష్‌రావే
మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ […]
కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు
మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]
తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు
తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను […]
తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్ జోక్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజెపి కాస్త బతికిపోయిందంతే. వామపక్షాలకు కూడా చోటు లేకుండా పోయింది తెలంగాణలో. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చేశారు టిఆర్‌ఎస్ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్. […]
ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం
ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు)పై ఓటింగ్ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే […]