తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం.. ఎంట్రీతో ఇవి మరింత హీటెక్కాయి. ప్రస్తుతం విపక్షాలన్నీ ఆయన్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్రతిపక్షాల్లో సరికొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. ఆయన సొంతంగా పార్టీ పెడతారనేప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో.. పార్టీలోంచి వలసలు ప్రారంభమైతే తమపార్టీల భవిష్యత్తు అంధకారంలో పడిపోయినట్టేనని ఆందోళన చెందుతున్నాయి. అసలే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సగం […]
Tag: Telangana
హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేకపోయినందుకు ఒకపక్క హైకమాండ్ తీవ్ర మథనపడుతుంటే.. వచ్చే ఎన్నికల్లో గెలిచి కొంతవరకైనా స్వాంతన చేకూర్చాలనే అభిప్రాయం ఏ ఒక్కరిలోనూ కనిపించడంలేదు. ఆధిపత్య పోరుతో నాయకులు.. ఒకడుగు ముందుకు వందడుగులు వెనక్కి వేస్తున్నారు. కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం మాని,,ఎవరికి వారు తమ స్వలాభాన్ని చూసుకుంటన్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో […]
కోదండరాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. అన్ని వర్గాలను సమైక్యం చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. కోదండరాం ఎదురుదాడితో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. దీని నుంచి బయటపడేందుకు ఆయన `కులం` కార్డును తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమన్.. కోదండరాం రెడ్డి అని సంబోధించి సరికొత్త చర్చకు దారి తీశారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని సమాచారం. ఒకపక్క తాము సేఫ్ సైడ్‌లోకి […]
మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..
విభజనతో 16వేల కోట్ల తీవ్ర లోటు బడ్జెట్‌తో ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ నష్టం కొనసాగుతూనే ఉంది. దీంతో అప్పు ఇచ్చే వారి కోసం ఏపీ ఎదురుచూస్తుంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా ఇలానే మారిందట. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ సాధన వైపు అడుగులేస్తోందని నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇదంతా కేవలం ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమేనట. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోందట. ఈ […]
తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేకర్ వేసే నాయకులు ఎవ్వరూ కనపడడం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్టర్ షో వేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ట్రెండ్స్‌ను బట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మరోసారి సీఎం అవుతారని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో సీనియర్లకు, సమర్థులైన నాయకులకు కొరత లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడర్లు అన్న చందంగా […]
ఆ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కకుండా మోడీ ప్లాన్
తెలంగాణలో టీఆర్ఎస్, భాజపా మధ్య క్రెడిట్ గేమ్ నడుస్తోందనే చర్చ మొదలైంది. తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి అవకాశాలు ఉండటంతో అందుకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని ఆ పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు! ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ అంశంలోనూ బయటకి కనిపించని క్రెడిట్ గేమ్ మొదలైందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసంమాట్లాడేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చి.. రద్దు చేయడంపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య […]
కోదండరాం సార్ విమర్శల స్టైల్ మార్చండి
తెలంగాణ ఉద్యమంలో అన్నివర్గాలను ఏకం చేసిన ఘనత జేఏసీ చైర్మన్ కోదండరామ్‌కి దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి అందరినీ మమేకం చేశారు. అయితే కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇంకా ఏపీకి చెందిన నేతలు, కాంట్రాక్టర్లపై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం సాధించుకుని మూడేళ్లు గడిచినా.. ఉద్యమ సమయంలో చేసినట్టు గానే ఇంకా విమర్శలు చేయడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. విమర్శలు చేసే […]
బాబు-కేసీఆర్‌లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్‌ది టాక్‌గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]
ఎట్‌హోంలో చంద్రుల మధ్య ఆసక్తికర చర్చ
గవర్నర్ సమక్షంలో మరోసారి ఇద్దరు చంద్రులు కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని సానుకూలంగా చర్చించుకున్నారు!! మరోసారి వీరి కలయికకు వేదికగా మారింది ఎట్ హోం కార్యక్రమం! ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీఎంలు.. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హైకోర్టు విభజనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కలుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నారనే అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం […]