అవును! టీఆర్ ఎస్‌కు పెట్టని కోట భువనగిరిలో కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సెంట్రిక్‌గా ఇప్పుడు పొలిటికల్ సీన్ రగులుతోంది! జిల్లా మొత్తంమీద ఇప్పుడు శేఖర్ గురించే ప్రతి ఒక్క నాయకుడూ మాట్లాడుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. నయీం నుంచి ఇతనికి ప్రాణ గండం ఉండడమే! అయితే, నయీం హతమై కూడా పదినెలలు గడిచిపోయాయి కదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. కానీ, నయీం అనుచరులు ఇంకా బతికే ఉన్నారుకదా? అందుకే […]
Tag: Telangana
కాంగ్రెస్ నుంచి విజయశాంతి జంప్….ఆ పార్టీలోకేనా…!
ప్రముఖ సినీ నటి, ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి మళ్లీ పార్టీ మారుతున్నారా ? ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి, తెలంగాణ పాలిటిక్స్‌ను వదిలేసి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. గతంలో పలు పార్టీలు మారిన విజయశాంతి ఇప్పుడు ఏకంగా స్టేటే మారిపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన ఆమె ఆ పార్టీ […]
టీటీడీపీలో ఆయన డమ్మీలకే డమ్మీనా..!
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు అక్కడ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా లేనట్టే లెక్క. ఇక టీటీడీపీకి ఓన్లీ అండ్ వన్ మ్యాన్ ఎవరంటే రేవంత్‌రెడ్డి ఒక్కడే. తెలంగాణలో రేవంత్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా పార్టీ పరంగా కన్నా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే ఎక్కువుగా తాపత్రయపడుతున్నారన్న చర్చలు కూడా […]
దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు
తెలంగాణలో బీజేపీకి ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్కడ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేటర్ హైదరాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు ఇలా ఎవరికి వారు గ్రూపులుగా వ్యహరిస్తుంటే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వరిని పట్టించుకోకుండా తాను ఓ సపరైట్‌గా వ్యహరిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని గొప్పలకు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపులతో పాతాళానికి పడిపోకుండా ఉంటే […]
బాబు గ్యాంగ్‌లో అవినీతి పరులు.. టీడీపీకి దెబ్బే!!
నేను నిప్పు! అవినీతిని సహించేది లేదు!! భరించేది అంతకన్నాలేదు!! అని పదే పదే వల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఎందుకంటే.. ఆయన పరివారం ఒక్కరొక్కరుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవడమే కారణంగా కనిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వడంతోనే ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో ఎక్కడ ఆ అపవాదు.. తనమీదకి వచ్చి పడుతుందోనని భావించిన బాబు.. తక్షణమే ఆయనను […]
కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనాలకు మారుపేరు. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజకీయాలను, సంచలన వ్యాఖ్యలకు మారు పేరు అయిన వీరిపై రాజకీయంగా మరో సంచలన రూమర్ హల్‌చల్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలోనే పీసీసీ చీఫ్ పదవి తమదే అన్నారు. ఉత్తమ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా నడుపుతారని ప్రశ్నించారు.. ప్రతిష్టాత్మకంగా జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని పక్కా పథకంలో ఉన్నారు కమల నాథులు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు మద్దతు పలుకుతూ.. ఇద్దరూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలోనే పరిస్థితి అర్ధం కావడం లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఒకింత బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్రమంలోనే 2019లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు పట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]
తీవ్ర అసంతృప్తితో వరంగల్ తూర్పు రాజకీయం
వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యం లేదని బావిస్తోన్న ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లోకి వెళతారని వార్తలు వస్తుండగా నియోజకవర్గంలోను సురేఖ దంపతులపై అధికార పార్టీలోనే అసంతృప్తి భగ్గుమంటోంది. నియోజకవర్గంలో చాలా మంది కార్పొరేటర్లు సురేఖ భర్త మురళీ తీరుపై లోలోన రగిలిపోతున్నారు. మురళీకి తెలియకుండా ఎవరది అయినా కార్పొరేటర్ పేరు పేపర్లో వచ్చినా అంతే సంగతులట. కొండా మురళికి తెలియకుండా మీటింగ్‌లు పెట్టడానికి కూడా వీల్లేదని ఆదేశాలు […]
గ్రూప్ -2 పరీక్షల్లో నిజామాబాద్ హవా…. ఎంపీ కవితపై లుకలుకలు
తెలంగాణ గ్రూప్-ఈ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలకు ఎంపిక కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పరీక్షరాసిన అభ్యర్థులు ఇప్పటికే పలు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా తాజాగా ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. గ్రూప్-2 పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులే ఎక్కువుగా ఎంపిక కావడంపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో […]