తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆయన వ్యూహాలతో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో దక్కదోనని టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చేలా అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. దిక్కుతోచని […]
Tag: Telangana
సీబీఐ దర్యాప్తుకి `నో` వెనుక రీజన్ ఇదేనా?
ఏదైనా కుంభకోణం బయటపడినా, ఆరోపణలు వచ్చినా వెంటనే `సీబీఐకి కేసు అప్పగించాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. ఎంత గందరగోళం సృష్టించినా.. వాటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయరు తెలంగాణ సీఎం కేసీఆర్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో, గ్యాంగ్ స్టార్ నయీం కేసులోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పుడు మియాపూర్ భూకుంభకోణం లోనూ కేసీఆర్ దీనినే ఫాలో అవుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించకుండా ఆ వివరాలను తన దగ్గరే ఉంచుకోవడం వెనుక వ్యూహం వేరే ఉందని పార్టీలో […]
టీఆరెస్ మంత్రులకు పాతవి బోర్ కొట్టాయా లేక భయం పట్టుకుందా!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి, అభ్యర్థుల పనితీరు ఆధారంగానే గెలుపోటములు ఉంటాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ సర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో బిజీ […]
భూ కుంభకోణంలో డీఎస్.. కేసీఆర్‌కి మరో తలనొప్పి!
తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభకోణాలతో సతమతమవుతోంది. ఆయా కుంభకోణాల్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల పేర్లు ఉండడం మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం కేసలో టీఆర్ ఎ స్ సెక్రటరీ జనరల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బదలాయించుకుని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్. ఇక, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు, కేసీఆర్‌కి అత్యంత ఆప్తుడు సీనియర్ పొలిటీషియన్ అయిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పైనే భూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేతర సంబంధం ఆరోపణలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గత నాలుగైదు రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గోల్డ్‌స్టోన్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి సైతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యేపై […]
కేసీఆర్ పై మైనారిటీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో!
తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ పదవి అంతగా అచ్చిరాదని అంటున్నారు నేతలు! నిజానికి డిప్యూటీ సీఎం అంటే.. సీఎం తర్వాత సీఎం అంతటి లెవల్. అయితే, తెలంగాణలో మాత్రం కాదట. అంతా తానే అని వ్యవహరించే కేసీఆర్.. మాత్రం.. డిప్యూటీ సీఎంను పూచిక పుల్లగా తీసిపారేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో మియాపూర్ భూ కుంభకోణం సంచలనంగా మారింది. ల్యాండ్ స్కామ్.. లో ఇప్పటికే […]
పాల్వాయి సొంత సీటుపై కోమటిరెడ్డి బ్రదర్స్ కన్ను
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి హఠాన్మరణంతో తెలంగాణలోని నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు యాంటీగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సపోర్ట్‌గా ఉంటూ వస్తోన్న పాల్వాయి మృతి రాజకీయంగా ఉత్తమ్‌కు పెద్ద దెబ్బే. అదే టైంలో ఆయన మృతి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాస్త రిలీఫ్ లాంటిదే. ఇదిలా ఉంటే పాల్వాయి మృతితో ఆయన సొంత నియోజకవర్గం అయిన మునుగోడులో కాంగ్రెస్‌కు నాయకత్వ కొరత ఏర్పడింది. […]
టీఆరెస్ ఎమ్మెల్యేల టెన్షన్ మొత్తం దాని గురించేనట
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ఎవ్వరికి అంతుపట్టవు. ఆయన నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు సొంత పార్టీ వాళ్లకే తెలియవు. అది కేసీఆర్ స్టైల్. తాజాగా కేబినెట్ విస్తరణలో ఆయన ఏం చేస్తారో ? ఎవ్వరికి అంతుపట్టకపోవడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఓ రేంజ్‌లో బీపీ పెరిగిపోతోంది. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. మరో 21 నెలల్లో 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే […]
కేకేకి కేసీఆర్ పొగ!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. గత శతృవు ఇప్పడు మిత్రుడు కావొచ్చు. ఇప్పటి మిత్రుడుపై వెగటు పుట్టనూ వచ్చు!! సాక్షత్తూ.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదే జరుగుతోంది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌కు నమ్మిన బంటుగా ఉన్న కే కేశవరావు(కేకే).. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆహ్వానంతో రాష్ట్ర ఆవిర్భావ సమయంలోనే పార్టీ కండువా మార్చేశారు. ఆ తర్వాత కేసీఆర్, కేకేల బంధం ఢిల్లీ వరకు పాకింది. అయితే, రాజకీయల్లో ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ.. కేకేకి […]