48 గంట‌లు..ఏపీ, తెలంగాణ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ఫీవ‌ర్‌

ఏపీ, తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల‌కు వ‌చ్చే 48 గంట‌ల పాటు ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు వ‌చ్చే 48 గంటల్లో ఏం జ‌రుగుతుందా ? అని న‌రాలు తెగే ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌రి వీరు అంత‌లా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నియోజ‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుందా ? లేదా ? అన్న‌దే వీరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణస్వీకారం అనంత‌రం రెండు […]

హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు టాలీవుడ్‌..!

డ్ర‌గ్స్ రాకెట్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్టే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో ఉన్న ఎవ్వ‌రినీ విడిచిపోట్ట‌బోమ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్లో క‌ల‌కలం మొద‌లైంది. కేసీఆర్ ప్ర‌భుత్వం.. టార్గెట్ చేసింద‌ని సినీ ఇండ‌స్ట్రీలోని కొంత‌మంది ఆవేద‌న చెందుతున్నార‌ట‌. ఇదే త‌రుణంలో ఏపీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్ర‌మ వైపు వీరి దృష్టిప డింద‌ని స‌మాచారం. ముఖ్యంగా ప్ర‌కృతి అందాలు, ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి చిరునామాగా ఉన్న విశాఖకు త‌ర‌లిపోతే […]

టీఆర్‌ఎస్‌లో క‌ల‌క‌లం.. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లు ఔట్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క్ష‌ణ క్ష‌ణం టెన్ష‌న్ టెన్ష‌న్‌గా మారింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే ప‌నికి శ్రీకారం చుట్టారు. ఇది బాగానే ఉన్నా.. ఎంచుకున్న విధానంపైనే ఇప్పుడు కిందిస్థాయి నేత‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అయితే, పార్టీకి బ‌లంగా ఉన్న వ్య‌క్తుల‌కు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించ‌గ‌ల వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ఇంచార్జ్ బాధ్య‌త‌లు […]

డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?

మాద‌క ద్ర‌వ్యాల కేసుకు సంబంధించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్‌ను దాదాపు 11 గంట‌ల‌కు పైగా హైద‌రాబాద్ సిట్ అధికారులు విచారించ‌డం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ప్ర‌స్తుతానికి 12 మంది పేర్ల‌నే సిట్ బృందం బ‌య‌ట‌పెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిప్ప‌లేందే పొగ‌రాద‌న్న‌ట్టు.. కేవ‌లం 12 మందితోనే భాగ్య‌న‌గ‌రంలో మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం సాగుతోంద‌ని చెప్ప‌లేం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పాత్ర కీల‌కంగా […]

మంత్రి ప‌ద‌వి కోసం కేసీఆర్ క‌న్నా పూజ‌లే న‌మ్ముకున్న ఎమ్మెల్యే

ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి ప‌ద‌వికోసం ముఖ్య‌మంత్రి న‌మ్ముకుంటారు. ముఖ్య‌మంత్రిని న‌మ్ముకున్న వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది. కానీ తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే పూజ‌ల‌ను న‌మ్ముకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పూజ‌ల‌ను న‌మ్ముకుని బుక్ అవ్వ‌డం ఏంట‌న్న షాక్‌లో కూడా మ‌నం ఉంటాం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గెలిచి ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఆయ‌న పార్టీ మారిన‌ప్ప‌టి […]

తెలంగాణ‌లో బీజేపీకి వాయిస్ క‌ట్‌

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార ప‌క్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించిన బీజేపీ ఇప్ప‌టికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మియాపూర్ భూములు స‌హా మిష‌ణ్ భ‌గీర‌థ‌లో లోపాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌తో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు క‌మ‌లం నేత‌లు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు క‌ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపైనే తెలంగాణ‌లో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే… తెలంగాణ‌లో కొంత పుంజుకున్న బీజేపీ నేత‌లు.. అధికార ప‌క్షాన్ని విమ‌ర్శించి […]

టీడీపీ జంపింగ్‌కు కేసీఆర్ షాక్ తప్ప‌దా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోను జంపింగ్‌ల జోరు ఎక్కువ‌గానే కొన‌సాగుతోంది. ఈ జంపింగ్‌ల పర్వం ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ఎక్కువుగా కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ దెబ్బ‌తో టీడీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, వైసీపీ, సీపీఐల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అత్తెస‌రు మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బ‌తో తిరుగులేని మెజార్టీతో ఉంది. ఇదిలా ఉంటే ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలంద‌రికి కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇస్తామ‌న్న హామీతో […]

సబితా ఇంద్రారెడ్డి ప్లాన్…హైకమాండ్ ఒప్పుకుంటుందా ?

మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రాజ‌కీయంగా పెద్ద యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌బితా టీ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుల దూకుడు ముందు పెద్ద‌గా ప్ర‌చారంలోకి రావ‌డం లేదు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ఆమె ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు టీ కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2009 ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రి అయిన స‌బితా […]

బీజేపీలోకి చంద్ర‌బాబు అనుచ‌రుడు..!

ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్రియ శిష్యుడు. చంద్ర‌బాబు ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చిన స‌ద‌రు పారిశ్రామిక‌వేత్తకు చంద్ర‌బాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయ‌న గెలిచారు. స‌ద‌రు పారిశ్రామిక‌వేత్త కోసం చంద్ర‌బాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియ‌ర్‌ను కూడా వ‌దులుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు అంత‌లా ప్ర‌యారిటీ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణ‌లోని ఖ‌మ్మం […]