పార్టీ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు కోపం, ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు.. అర్థం కాదు.. కోపం వచ్చిన వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది.. ప్రేమ చూపిన మరుక్షణమే కోపంగా మారిపోతారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం కష్టం. సరే అనడం తప్ప ఏమీ చేయరాదు. ఇంతకీ అసలు విషయమేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కియా కార్ కార్నివాల్ అంటే ఎందుకో ప్రేమ ఎక్కువైన్నట్లుంది. కారు అంటేనే కియా కార్నివాల్.. ఇక ప్రపంచంలో అంతకుమించి కార్లున్నాయా.. దానిని కాక దేనిని […]
Tag: Telangana
పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?
కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]
దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు
రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]
ఐఏఎస్ వద్దు..రాజకీయాలే ముద్దు?
పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. వివిధ హోదాల్లో ప్రజాసేవ.. గ్రూప్ 1 అధికారిగా ఎంపిక.. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీఓగా విధి నిర్వహణ, 2007లో ఐఏఎస్ హోదా.. డ్వామా పీడీ, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం, ఆ తరువాత కన్ఫర్మ్డ ఐఏఎస్ గా పదోన్నతి.. జేసీగా పనిచేసిన వ్యక్తి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ గా ప్రజాసేవ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఆయనే వెంకట్రామరెడ్డి.. ఇందులో ఏముంది.. అంత […]
బాస్ మదిలో ఏముందో? ఎమ్మెల్సీ బెర్త్ ఎవరికిస్తాడో?
టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల దాఖలుకు ఈరోజే (మంగళవారం) చివరి రోజు కావడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో బీపీ పెరిగిపోతోంది. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపిక కాని వారికి సమాధానం ఏం చెప్పాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచీ ఇదే విషయంపై కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఆఖరి రోజు వరకు ఎంపిక చేయకపోవడంతో నాయకులు టెన్షన్ తో అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో […]
కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!
కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. […]
తారకరాముడి లేఖ కేంద్రంలో కదలిక తెచ్చేనా?
రెండువేల కోట్ల రూపాయలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.. అయినా స్పందన లేదు.. చేనేత జౌళి శాఖను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. కేంద్రం కూడా పట్టించుకోవాలని తెలంగాణ మంత్రి కే.తారక రామారావు పేర్కొంటున్నారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణను పట్టించుకోవడం లేదని, వనరులు లేని రాష్ట్రాలకు నిధులిస్తూ మాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై భారీ […]
జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!
వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ […]
అయ్యో…ఇంతటి అవమానమా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చారు.. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గన్నారు.. ఇతర ముఖ్యమంత్రులు కూడా వచ్చారు.. తెలంగాణసీఎం కేసీఆర్ కూడా సమావేశానికి వెళ్లాల్సింది.. అయితే ఆయనకు బదులుగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే అందరికీ లభించినట్లు తెలంగాణ టీమ్ కు మర్యాద దక్కలేదని సీఎస్ నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా సమావేశానికి వచ్చే ప్రతినిధులకు […]