హోదా ఇచ్చే వరకూ పోరాడదామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు హోదాతో ఒరిగేది ఏమీ లేదు ప్యాకేజీతోనే లాభమని ఫిరాయించారు!! హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలి అని పోరాడిన వెంకయ్య.. ఇప్పుడు ప్యాకేజీనే మంచిదంటూ నీతులు వల్లెవేస్తున్నారు!! హోదా అని ప్యాకేజీ ఇచ్చారేంటి? అని ప్రశ్నించేందుకు బాబు సిద్ధంగా లేరు! టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయకులు ఏపీ ప్రజలకు పెట్టిన శఠగోపం గురించి మాట్లాడేందుకు నోరు మెదపడం లేదు! హోదా కోసం జరిగే పోరాటం పుంజుకుంటే […]
Tag: TDP
టీడీపీ – బీజేపీ దాగుడుమూతల దండాకోరాట
ఏపీలో అధికార టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలోనే అటు కేంద్రంలోనూ టీడీపీతోనూ కలిసి నడుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో రెండు మంత్రుల స్థానాలు, అటు కేంద్రంలో రెండు స్థానాలు ఈ రెండు పార్టీలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇరు పక్షాల నడుమ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే, ఈ కెమిస్ట్రీ కొన్ని కొన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారట ఇరు పక్షాల నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రం ఏమీ చేయడం లేదని టీడీపీ […]
ఆ మంత్రి పోస్ట్ ఊస్టింగ్‌పై లోకేశ్ సిగ్నల్స్
ఏపీ మంత్రి రావెలకి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందా? ప్రస్తుతం దావోస్‌లో ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి రాగానే మంత్రి వర్యులను మర్యాదగా ఇంటికి సాగనంపుతారా? ఇన్నాళ్లూ.. పదవిని చూసుకుని రెచ్చిపోయిన రావెల ఇక పదవీచ్యుతుడై.. తన నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యేగా మిగులుతారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గత కొన్నాళ్లుగా సొంత పార్టీలోనే రావెలకు వ్యతిరేకత ఎక్కువైంది. అయినవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ అన్నచందంగా పార్టీ కోసం అహరహం శ్రమించిన […]
జనసేనలోకి గోడమీద గోపీలు
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు! నేతలు ఎప్పుడూ ఒకే పార్టీని నమ్ముకుని ఉంటారన్న గ్యారెంటీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరికలు నెరవేరకపోయినా.. పక్క పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా నేతలు తమకు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి పక్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీలకు కొదవలేదు. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవల దాకా క్యూ కట్టి మరీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేతల తరహాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్
నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్‌లో 100 సినిమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బాలయ్య కేరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీక్ […]
లోకేశ్ కోసం బాబుకు ఎన్ని కష్టాలో..!
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు మోయాల్సిన నాయకుడు లోకేష్! టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అయితే అందరూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీలక పదవి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై పట్టు సాధించలేకపోవడం, చురుకుగా వ్యవహరించలేకపోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే ఉండటం.. వంటి కారణాలతో ఎప్పటికప్పుడు అడ్డంకులు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్రబాబు […]
అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్
క్యాడర్ బలంగా ఉన్నా నేతలు లేరు!! నాయకులున్నా వారి మధ్య సఖ్యత లేదు! నేనున్నా అంటూ నడిపించే నాయకుడు ఇప్పుడు టీటీడీపీకి కరువయ్యాడు. పేరున్న నేతలంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవ్వడంతో.. తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడం వదిలి.. నేతలంతా ఇప్పుడు ఫైటింగ్‌కు దిగారు. 2019లో ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. `తెలంగాణలో క్యాడర్ ఉంది.. దానిని సరైన […]
మంత్రి ఒత్తిడితో ఆయన్ను పక్కన పెట్టిన బాబు
రాజకీయాలన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అంత వీజీకాదు! అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో ఏమీ కాకుండాను ఉండిపోవచ్చు.. ఏమీ కావడం లేదు.. అనుకుంటున్న తరుణంలో ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితమూ రావొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్కడికే వద్దాం.. కాంగ్రెస్ సీనియర్ నేతగా, కడప జిల్లా మైదుకూరు నుంచి రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎల్ రవీంద్రారెడ్డి.. ప్రజా క్షేత్రం నుంచి దూరమై దాదాపు మూడేళ్లదాకా అవుతోంది. అయితే, ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి సెంటర్ ఆఫ్‌ది […]
పరిటాల అనుచరుడికి షాక్ తప్పదా..!
అనంతపురం టీడీపీలో ఆధిపత్య రాజకీయాలు తెరమీదకి వచ్చాయి. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి పరిటాల సునీతల మధ్య ఆధిపత్య పోరు.. పీక్ స్టేజ్‌కి చేరే టైం వచ్చేసింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంపై టీడీపీ స్థానిక నేతల్లో అంతర్గత యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వర్గం పైచేయి సాధిస్తుందా? పరిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 2014లో జరిగిన జడ్‌పీటీసీ ఎన్నికల్లో […]