సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీడీపీలో ఎంతో సీనియర్, మాజీ మంత్రి…నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతమంది ఉన్నా టీడీపీ వరకు ఆయనదే రాజ్యం అన్నట్టుగా ఉండేది. అలాంటి సోమిరెడ్డి ఏకంగా 2004 – 2009 – 2012 – 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయినా చంద్రబాబు మాత్రం వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తాజాగా కేబినెట్ ప్రక్షాళనలో కూడా ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖా మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన సత్తా ఏంటో ఆయన వ్యతిరేకులకు తెలిసొచ్చింది. […]
Tag: TDP
దుకాణం బంద్ చేసిన ఎంపీ కేశినేని
ఏపీ, తెలంగాణలో కేశినేని ట్రావెల్స్ అంటే బస్సు సర్వీసుల్లో నెంబర్ వన్ సంస్థగా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే కేశినేని ఫ్యామిలీ ట్రావెలింగ్ రంగంలో ఉంది. అప్పట్లోనే వాళ్లు విజయవాడ నుంచి మచిలీపట్నానికి బస్సులు నడిపేవారట. ట్రావెలింగ్ రంగంలో అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కేశినేని ట్రావెల్స్‌ను ఈ రోజు శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ప్రస్తుతం విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బాగా నష్టాలు వస్తుండడంతో తన ట్రావెల్స్‌ను […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: ” గన్ని వీరాంజనేయులు – ఉంగుటూరు “
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఈ మూడేళ్ల కాలంలో ఎలాంటి ప్రగతి సాధించారు ? తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ? గన్నికి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయో ? చూద్దాం. టీడీపీలో సాధారణ కార్యకర్తగా కేరీర్ స్టార్ట్ చేసిన గన్ని ఉంగుటూరు నియోజకవర్గంలో చచ్చిపోయిన టీడీపీని, పార్టీ కార్యకర్తలను బతికించారు. 2009లో గన్ని భార్య లక్ష్మీకాంతం ఇక్కడ పోటీ చేసి […]
టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి..!
ఏపీ కేబినెట్ విస్తరణ జరిగిన కొద్ది రోజులకే కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరగనుంది. ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎంత ఉత్కంఠ క్రియేట్ చేసిందో ? ఇప్పుడు కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 27న కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. సీనియర్ ఎంపీలను, జూనియర్లను సమన్వయం చేస్తూ ఈ సారి మోడీ కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో […]
కృష్ణా టీడీపీలో ఉమా ఒక్కడే ఒకవైపు…అందరూ ఒక వైపు..
ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కృష్ణా జిల్లా పేరు చెప్పగానే ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావే గుర్తుకు వస్తారు. కీలకమైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్రబాబు వద్ద ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో ఎంతమంది ఉన్నా చంద్రబాబు మాత్రం ముందుగా ఉమా చెప్పినట్టే వింటారన్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డవలప్ చేసే విషయంలో దూకుడుగాను, స్పీడ్‌గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎదగనీయకుండా..తాను హైప్ అయ్యేందుకు రకరకాల ఎత్తులు వేస్తారన్న […]
నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్కలాట
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జరగనుంది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఇక్కడ త్వరలోనే ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మరో రెండు వర్గాలు చాపకింద నీరులా అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్యకర్తల సమావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్నల్స్ పంపుతున్నారు. ముందుగా మాజీ మంత్రి […]
అమరావతిలో రోడెక్కిన టీడీపీ నాయకుల ఫైటింగ్
ఏపీ టీడీపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏర్పడ్డ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు రాని సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్పటికే వివిధ రూపాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి రాని ఓ ఎమ్మెల్యే అనుచరులు మంత్రి పదవి వచ్చిన మంత్రిని అడ్డుకుని నానా హంగామా చేశారు. ఇదంతా ఏపీ రాజధాని అమరావతిలో జరగడం విశేషం. మంత్రివర్గ ప్రక్షాళనలో గుంటూరు జిల్లా నుంచి రావెల […]
జనసేన సిద్ధాంతకర్తగా టీడీపీ ఎమ్మెల్సీ
మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఒకరు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఆయనకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయనో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో రగిలిపోతున్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేగాక ఈ విషయంపై అధినేత పవన్ కల్యాణ్‌తోనూ మంతనాలు […]
లోకేశ్‌పై ఊస్టింగ్ మినిస్టర్ సెటైర్లు
టీడీపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఏ రేంజ్‌లో సెగలు రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని సీనియర్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇక ఉద్వాసనకు గురైన మంత్రులు సైతం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని అనారోగ్యం పేరుతో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆయన మాత్రం ‘పంచ్ లు’ వేస్తున్నారు. బొజ్జలకు చంద్రబాబు ఎంత నచ్చచెప్పినా ఆయన, ఆయన తనయుడు సుధీర్‌రెడ్డి మాత్రం అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు. బొజ్జల […]