మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫస్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు) నుంచి 2009లో ఫస్ట్ టైం పోటీ చేసిన రవీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓటమి చూసినా ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కలియతిరిగి పార్టీలో పట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]
Tag: TDP
మహానాడు ముందు విశాఖ నేతలకు షాక్
అసలే మంత్రి పదవులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విశాఖ నేతలకు సీఎం చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నేతల ఆశలు ఆవిరి చేసేశారు! ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడులో దీనిపై ఏదో ఒక ప్రకటన చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలను నీరుగార్చేశారు. ఎంపీలు – ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు […]
జగన్ కంచుకోటను కూల్చుతోన్న ఆ ఇద్దరు ఎవరు..!
వైఎస్.ఫ్యామిలీ పేరు చెపితే కడప జిల్లాలో….అందులోను పులివెందులలో ఆ ఫ్యామిలీ క్రేజ్, పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్.ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల కోటకు ఇప్పుడిప్పుడే బీటలు వారుతోంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉండి కూడా జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డి ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలకు, వైఎస్ అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు. వైఎస్ […]
నోరుజారారు.. పదవి పోగొట్టుకున్నారు
అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె […]
ఆ జిల్లా అధ్యక్ష పదవికి ఇంత పోటీనా?
ప్రకాశం జిల్లా టీడీపీలో నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనికోసం పార్టీలోని సీనియర్లు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు జోరుగా పావులు కదుపుతున్నారు. ఈ పీఠాన్ని దక్కించుకుని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటూ.. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒకరు.. గుర్తింపు కోసం మరొకరు.. ఇలా ఎవరి అవసరాలు వారివి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మధ్య మిత్ర బంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్..ప్రధాని మోదీతో భేటీ అనంతరం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే హీట్ పెరిగిపోతున్న సమయంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మరో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. మద్యం అమ్మకాల విషయంలో తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న […]
మాటలతో కానిది భేటీతో సాధ్యమైందా?
మాటల వల్ల చెప్పలేనిది మీటింగుల వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధాని మోదీతో ప్రతిపక్ష నేత జగన్ భేటీ.. ఏపీలో రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది. 2019లో జగన్ జైలుకు ఖాయమని, ఇక అధికారం శాశ్వతమని భావిస్తున్న నేతలకు ఒక్కసారిగా గొంతులో వెలగపండు పడినంత పనయింది. ఇదే సందర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]