తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గ‌త కొన్నాళ్లుగా మ‌రింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వాడి వేడిని మ‌రింత పెంచారు. ఇటీవ‌ల ముగిసిన మ‌హానాడు త‌ర్వాత ఈ వాడి మ‌రింత పెరిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. టీడీపీకి మీడియా క‌వ‌రేజ్ ఘోరంగా త‌గ్గిపోయింద‌ట‌! తమ ప‌క్షానే ఉంటాయ‌ని భావించిన ఆ రెండు ప‌త్రిక‌లు […]

బాబూ… ఏపీ క‌ష్టాల్లో ఉన్నా.. ఇన్ని క్యాంప్ ఆఫీస్‌లా? 

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ స‌భ‌లో మాట్లాడాల్సి వ‌చ్చినా.. తాను సీఎంగా ఉన్న రాష్ట్రం ఎన్నో క‌ష్టాల్లో ఉంద‌ని, ఎన్నో న‌ష్టాలు చ‌విచూస్తున్నామ‌ని చెప్పుకొస్తారు. లోటు బ‌డ్జెట్‌తో ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంద‌ని, అయినా .. తాను కాబ‌ట్టి రాష్ట్రాన్ని లైన్‌లో పెడుతున్నాన‌ని పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. వ‌చ్చిన వాళ్ల‌ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకొని.. రాష్ట్రం ప‌ట్ల జాలి ప‌డేలా కూడా చేస్తారు. బాబు మాట‌లు.. నిజ‌మేన‌ని అంద‌రూ అనుకుంటారు. దీనికి […]

ఆ జిల్లాలో ముగ్గురు ఎంపీల‌కు బాబు టిక్కెట్ ఇవ్వ‌డ‌ట‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెద్ద షాకింగ్ డెసిష‌న్ తీసుకోబోతున్నారా ? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌రా ? అంటే ప్ర‌స్తుతం ఆ జిల్లాలో వినిపిస్తోన్న రాజ‌కీయ చ‌ర్చ‌ల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. ఏపీలోని పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాజ‌మండ్రి నుంచి సినీన‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌, […]

గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే సీటు య‌మ హాటు గురూ..!

ఏపీలో కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సీటు ఇప్పుడు య‌మ హాటుగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఆ ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. ఆ సీటు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో ఉండేందుకు టీడీపీలోనే ఏకంగా ఐదుగురు పోటీ ప‌డుతున్నారు. ఈ హాట్ న్యూస్ జిల్లా పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ‌కు వ‌స్తోంది. జిల్లా కేంద్ర‌మైన గుంటూరు వెస్ట్ సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార […]

ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

చంద్ర‌బాబు అభివృద్ధిని ప‌రోక్షంగా ఒప్పుకున్న అంబ‌టి

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర‌య్యే వైసీపీ అధికార ప్ర‌తినిధ అంబ‌టి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా పొడిగేశాడు అంబ‌టి. నాలుగు రోజుల కింద‌ట ముగిసిన మహానాడులో లోకేష్‌, చంద్ర‌బాబు ల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్‌గా అంబ‌టి మాట్లాడారు. అయితే, ఆయ‌న తిడుతున్నాను అనుకుని బాబు పాల‌న‌ను పెద్ద ఎత్తున పొగ‌డ‌డమేకా కుండా బాబు చెబుతున్న విష‌యాల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించేశాడు. అవేంటో చూద్దాం. హైద‌రాబాద్ లో […]

రేవంత్ రెడ్డి పాలిటిక్స్‌.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణ‌లో వ‌ద్దు!

పాలిటిక్స్ అన్నాక ఎక్క‌డేసే తాళం అక్క‌డ వేయాల్సందే! అయితే, అది సృతి త‌ప్ప‌కుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి త‌ప్పినా.. నాట‌కం బ‌య‌ట‌ప‌డిపోవ‌డ ఖాయం! ఇప్పుడివ‌న్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్య‌లు డ‌బుల్ రోల్ పాలిటిక్స్‌ని త‌ల‌పిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒక‌లాగా, తెలంగాణ‌లో ఉంటే మ‌రోలాగా మాట్లాడ‌డం రేవంత్‌కి అల‌వాటైపోయింద‌ట‌! ఇప్పుడు ఆయ‌న వైఖ‌రిపై తెలుగు త‌మ్ముళ్లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నాలుగు రోజుల కింద‌ట విశాఖ‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు రేవంత్ […]

గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం

ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రిగా ఉన్న గంటా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ గెలిచి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్‌లో మ‌రో మంత్రిగా ఉన్న […]

జ‌గ‌న్ క‌ల ఫ‌లిస్తుందో.. కోరిక నెర‌వేరుతుందో చూడాలి

2019లో ఎట్టి ప‌రిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని పంతం మీదున్న జ‌గ‌న్‌.. త‌న ప‌ట్టుద‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు, త‌న క‌ల‌ల పీఠం ఎక్కేందుకు ఎంత‌టి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ స‌మాచారం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తోంది. మొన్నామ‌ధ్య ప్ర‌ధానితో క‌లిసేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ర‌చ్చ‌చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ వెన‌కాల జ‌రిగిందేంటో బ‌య‌ట‌కు వ‌స్తోంది. గ‌త వారంలో తెలుగు రాష్ట్రాల […]