వామ్మో.. ఇప్పుడు రాజీనామా చేయాలా.. ఇదేంది బాసూ.. !

విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేస్తాం.. మరి మీరు అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాయడం పార్టీలో కాకపుట్టిస్తోంది. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే రాజీనామా ఏంటి అని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మేము చేయగలం.. మరి మీరు అని సీఎం జగన్ ను, ఆయన పార్టీని చంద్రబాబు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కుకు టీడీపీ సంపూర్ణ మద్దతు […]

నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య ఆవేశం..వర్కౌట్‌ కాదంటూ వ్యాఖ్య‌లు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే చూడాల‌ని అభిమాన‌లు, టీడీపీ శ్రేణులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా ఎన్టీఆరే అంద‌రికీ క‌నిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ, రోజులు, సంవ‌త్స‌రాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటిక‌ర్ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. అయితే బ‌ర్త్‌డే సందర్భంగా బాల‌య్య తాజాగా ఓ మీడియా సంస్థకు […]

బాలయ్య బ‌ర్త్‌డే..వెల్లువెత్తుతున్న విషెస్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 61 పుట్టిన రోజు నేడు. సినీ రంగంలోనూ, రాజ‌కీయ రంగంలోనూ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న బాల‌య్య బ‌ర్త్‌డే అంటే నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు అభిమానులు. […]

తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్‌.ర‌మ‌ణ‌?!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మ‌రో కోలుకోలేని ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగ‌నుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్‌ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపార‌ట‌. […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీని వీడ‌నున్న ప‌న‌బాక ల‌క్ష్మి?!

తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్ర‌బాబు నాయుడికి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. మాజీ మంత్రి పన‌బాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నార‌న్న వార్త‌లు ప్ర‌స్తుతం ఊపందుకున్నాయి. పన‌బాక లక్ష్మి భర్త పన‌బాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన ప‌న‌బాక ల‌క్ష్మి.. ఘోర ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక‌ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా […]

మాగంటి బాబు ఇంట మ‌రో విషాదం..రెండో కుమారుడు మృతి!

ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుటుంబంలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ర‌వింద్ర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఆయ‌న అక్కడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నారు. అయితే […]

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే.. నారా లోకేష్ స్పెష‌ల్ విషెస్‌!

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయ‌న అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]

ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని […]