సూప‌ర్ థ్రిల్లింగ్‌గా సునీల్ `కనబడుటలేదు` ట్రైల‌ర్‌!

సునీల్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం `క‌న‌బ‌డుటలేదు`. ఎమ్ బాలరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో సతీష్, దిలీప్, శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఆగస్టు 13న థ‌యేట‌ర్‌లో విడుల‌ద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా […]

“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఇక్క‌డే ఊహించ‌ని ట్విస్ట్ ప్లాన్ చేశాడ‌ట స‌క్కూ. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]

`ఆర్ఆర్ఆర్‌` కోసం బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌భాస్‌-రానా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‏తో జనాల్లో […]

సునీల్ `క‌న‌బ‌డుట‌లేదు` టీజ‌ర్‌కు డేట్ ఫిక్స్‌!

కమిడియన్‌గానే కాకుండా హీరోగా, విల‌న్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టుడు సునీల్ తాజా చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో సునీల్ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎమ్‌.బాల‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌ను జూన్ 26న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్‌. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]

సునీల్‌ను వ‌ద‌ల‌ని త్రివిక్ర‌మ్‌..ఈసారైనా స‌క్సెస్ అయ్యేనా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సునీల్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. క‌మెడియ‌న్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. హీరోగా మారాడు. అయితే ఈ మ‌ధ్య కెరీర్ బాగా డ‌ల్ అయిపోయివ‌డంతో.. మ‌ళ్లీ కామెడీ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల మీద దృష్టి పెట్టాడు. అయిన‌ప్ప‌టికీ […]

క‌ష్టాల్లో హీరో సునీల్ …. తెర వెన‌క ఏం జ‌రుగుతోంది

తెలుగులో త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ క‌మెడియ‌న్‌గా మారిన సునీల్ అందాల రాముడు సినిమాతో వెండితెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు, పూల‌రంగ‌డు, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌ర్యాద‌రామ‌న్న సినిమాల‌తో ఒక్క‌సారిగా టాప్ పొజిష‌న్‌కు చేరుకున్నాడు. మిస్ట‌ర్ పెళ్లికొడుకు సినిమా నుంచి వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాప్ సినిమాలు చేస్తోన్న సునీల్ వ‌రుస‌గా ఆరేడు ప్లాపులు ఇచ్చాడు. కృష్ణాష్ట‌మి, జ‌క్క‌న్న‌, వీడు గోల్డ్ ఎహే, ఉంగ‌రాల రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ ప్లాపుల ప‌రంప‌ర‌కు ఇప్ప‌ట్లో […]

తుస్సుమ‌న్న ట్రైల‌ర్‌..సునీల్ ఖాతాలో మ‌రో రొట్ట సినిమా..?

ఒకే ఒక్క హిట్టు కోసం నానా ఆప‌సోపాలు ప‌డిపోతున్నాడు క‌మెడియ‌న్ కం హీరో సునీల్‌. నాలుగైదు వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న సునీల్ ప‌రిస్థితి ఇప్పుడు బాగా దిగ‌జారిపోయింది. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సునీల్ మాత్రం హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉంగ‌రాల రాంబాబు పేరుతో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడ‌న్న విష‌యం మ‌న‌కు చాలా రోజులుగా తెలుసు. ఇబ్బందుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు లోప‌లే మ‌గ్గిపోతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ చూస్తేనే […]

సునీల్ మార్కెట్ ఎలా దిగ‌జారిందో తెలిస్తే షాకే

టాలీవుడ్‌లో ప్ర‌తి యేడాది 125-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో  స‌క్సెస్ రేటు 20 శాతం కూడా ఉండ‌డం లేదు. పెద్ద హీరోల సినిమాల‌తో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల వ‌ర‌కు శాటిలైట్ మార్కెట్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. అయితే ఓ 50 సినిమాలు అయితే కేవ‌లం శాటిలైట్ మార్కెట్ కోస‌మే తీస్తున్నారు. కామెడీ సినిమాల‌కు కూడా శాటిలైట్ మార్కెట్ బాగానే ఉంటుంది. కామెడీ హీరోలు అయిన న‌రేష్‌, సునీల్ లాంటి హీరోల సినిమాల‌కు శాటిలైట్ […]