మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభోత్సవం… చిందులేయనున్న తమన్నా, రష్మిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్‌కి ముందు గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. […]

టీ 20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల …!

టీ 20 వరల్డ్ కప్ 2021 ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదిక గా జరుగనున్న పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందులో ఈ ఏడాది జరిగిన టీ20 డేట్లనే ఒక రోజు ముందుకు మార్చారు. ఎప్పటిలాగే రెండు గ్రూపులుగా చేసి ముందుగా సూపర్ 12 […]

ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీక్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు..!

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అత్యంత ఎక్కువగా అభిమానిస్తుంటారు భారతదేశ పౌరులు. కొంత మంది అయితే, క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే చాలు.. టీవీకే అతుక్కుపోతుంటారు. ఈ సంగతులు పక్కనబెడితే.. టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ వెంటనే అమలులోనికి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొడుకే స్టువర్ట్ బిన్నీ కాగా, 1983 వరల్డ్ […]

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు సిద్దం అవుతున్న బి‌సి‌సి‌ఐ..?

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్. అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు. ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు. ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు. 1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌న కూడా ఒలింపిక్స్ లో ఉండేది. ఆ తర్వాత దానిని కొనసాగించలేదు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులు ఓ తీపికబురు […]

ఒలంపిక్స్ లో భారత్ కి తొలి పథకం సొంతం.. !

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించగా.. ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను దక్కించుకున్నారు. స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు. 2016లో జరిగిన రియో […]

భారత్-శ్రీలంక సిరీస్ రీషెడ్యూల్ డేట్స్ ఇవే..!

భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే క్రికెట్ సిరీస్, టీ20 సిరీస్‌ల ప్రారంభ తేదీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే జులై 13వ తేదీ నుంచి స్టార్ట్ కావాల్సిన వన్డే సిరీస్ నాలుగు రోజులు ఆలస్యంగా అనగా జూలై 17నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ వన్డే 17న, సెకండ్ వన్డే 19న, మూడో వన్డే 21న జరగనుంది. జూలై 24న ఫస్ట్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 25న రెండో టీ20, 27న మూడో టీ20 […]

ఐపీఎల్‌కు బీసీసీఐ కొత్త రూల్‌.. రైనాపైనే చ‌ర్చ‌..!

ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక 2022 సీజన్‌ని 10 జట్లతో నిర్వహించాలని ఇప్ప‌టికే బీసీసీఐ ప‌క్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే కొన్ని హింట్స్ ఇచ్చినా బీసీసీఐ ఎలాగైనా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని ఈ ఏడాది చివరి క‌ల్లా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. కాగా రెండు జట్లు కొత్తగా టోర్నీలోకి వస్తుండగా.. ఓ కొత్త రూల్‌ని కూడా బీసీసీఐ స్ప‌ష్టంగా […]

అక్టోబర్‌ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్‌..?

భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్‌ […]

బీసీసీఐ కీలక నిర్ణయం..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. గత సీజన్ మ్యాచ్ లను నిర్వహించిన స్టేడియంలలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్ లు జరగనున్నాయి. మిగతా టోర్నీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది ఇలా అందరినీ బయోబబుల్ […]