పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నల్ల కోటు ధరించి వకీల్ సాబ్‌గా పవన్ అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడు పవన్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వకీల్ సాబ్‌గా మారాడు. ప్రస్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొదటి […]
Tag: pawan kalyan
రాజమౌళికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..ఏం జరిగిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
పవన్ హీరోయిన్ ఆవేదన..2 రోజులుగా నరకమంటూ పోస్ట్!
కరోనా వైరస్ మళ్లీ ఎక్కడికక్కడ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా కాటుకు ఇప్పటికే ఎందరో బలైపోయారు. ఇలాంటి విపత్కర సమయంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటొంది బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గత రెండు రోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ […]
అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..సారీ చెప్పిన బ్యూటీ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్ చూసినట్టు అనుపమ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వకీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాలో అందరి […]
పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్ సాబ్ మూవీలో ఒక చోట తన ఫోన్ నంబర్‌ను వాడుకుని, […]
`గబ్బర్ సింగ్`లో మొదట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో మొదట అనుకున్నది పవన్ కళ్యాణ్ కాదట. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా […]
పవన్ సినిమాలో బంపర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్. కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లింది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, పవన్ హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ […]
`వకీల్ సాబ్`పై పైరసీ దెబ్బ..షాక్‌లో అమెజాన్ ప్రైమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్‌తో అదిరిపోయే వసూళ్లు […]
ఓటీటీలోకి `వకీల్ సాబ్`..ఇంత త్వరగా రావడానికి అదే కారణమట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం `వకీల్ సాబ్`. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ […]