ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

కేసిఆర్ ..ఈ ప్రశ్నకు బదులేదీ?

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. పది రోజుల క్రితం హైదరాబాద్‌, ఢిల్లీలో ఇదే చర్చ. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వరిని కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్కులో నిరసనకు దిగారు. తరువాత ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీలో ఎవరినీ కలువకుండా తిరిగొచ్చారు. మరి ఎందుకు.. ఏమిటి అనేది ఆయనా చెప్పలేదు. ఎవరూ అడగలేదు. ఈ సమస్యపై పార్లమెంటులో కారు పార్టీ సభ్యులు రచ్చచేస్తున్నారు. కేకే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలే […]

కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]

‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ […]

మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు

తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]

జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ […]

అసలు ’వరి‘ని కొనేదెవరు? ..ముందు ఇది తేల్చండి

తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కింది. రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే..కాదు.. కేంద్ర ప్రభుత్వమే ఆ పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుపడుతోంది. దీంతో రాష్ట్రంలో వరి కొనుగోలు సంగతి పక్కకువెళ్లి టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తే.. శుక్రవారం టీఆర్ఎస్ కూడా నిరసన బాట పడుతోంది. ఒకవైపు రైతులు కొనుగోళ్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే.. బాధ్యతగల […]