విపక్షం వైసీపీ నేత జగన్ 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారా? ఎట్టి పరిస్థితిలోనూ 2019లో అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న యువనేత ఆ దిశగా తన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారా? ఈ క్రమంలో దశాబ్దాల కిందట టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నాడా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికారం చేపట్టాలనేది జగన్ కి అత్యవసరమైన విషయం. […]
Tag: NTR
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పండగ చేసుకునే న్యూస్. ప్రస్తుతం జైలవకుశ సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత వరుసగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివకు కమిట్ అయ్యాడు. ఇక రాజమౌళి సైతం ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్‌లో మునిగి తేలుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ జోష్ నుంచి ఇంకా తేరుకోకముందే వారికి మరో పండగ చేసుకునే వార్త వచ్చేసింది. ఎన్టీఆర్ హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన రియాల్టీ […]
ఎన్టీఆర్‌కు భారతరత్న… చేతులు దులుపుకున్న చంద్రబాబు
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి వినిపించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలి అనేది కొన్నేళ్లుగా ఏపీలో వినబడుతున్నామాట! అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ విషయం కేంద్రానికి కూడా చేరింది. ఇక, తాజా విషయానికి వస్తే.. ఎన్‌టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి అనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ అభిప్రాయం లేదా? అనే […]
నందమూరి కుటుంబాన్ని వదిలేస్తే.. బాబుకు కష్టమే!!
నందమూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్రబాబుకి మధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్రచారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్‌టీఆర్‌ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భవిష్యత్తులో వారితో అవసరం లేదని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయట టీడీపీ కేడర్‌లో! దీనికి ప్రధాన కారణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభమైన మహానాడేనని చర్చిస్తున్నవారు చెబుతున్నారు. మరి విషయం ఏంటో చూద్దాం. టీడీపీ మహానాడు శనివారం విశాఖలో ఘనంగా […]
ఎన్టీఆర్ కి ఇది పెద్ద సంచలనమే అవుతుందా!
టాలీవుడ్ యంగ్‌టైగర్ పొలిటికల్ మ్యాటర్‌పై ఏ చిన్న విషయం వచ్చినా మీడియా సర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచర్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో లెక్కలు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తాను తెరకెక్కించే సినిమాతో త్రివిక్రమ్ […]
ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ
కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడమంటే ఏ హీరోయిన్‌కి అయినా అదృష్టమే! అందులోనూ వరుస హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావడమంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్రస్తుతం నాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో చేయబోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశాడట యంగ్ టైగర్!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
” జై లవ కుశ ” శాటిలైట్ బిజినెస్ క్లోజ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో జై లవ కుశకు బిజినెస్ పరంగా కూడా ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ రూ.85 కోట్ల షేర్ రాబట్టి… ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే జై లవ కుశ సినిమాకు రూ. 80 కోట్ల వరకు బిజినెస్ జరుతున్నట్టు ట్రేడ్‌వర్గాల […]
ఫ్యామిలీ విషయంలో పవన్ – తారక్ ఒకటేనా..!
వాళ్లిద్దరూ పెద్ద కుటుంబాలకు చెందినవారు. ఒకరు సినీ హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మరొకరు రాజకీయం, సినీ నేపథ్యం కలగలసిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్దరూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. పరిస్థితులు ఇద్దరినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చర్చ మొదలైంది. వీరిని గమనిస్తే..ఇద్దరిలోనూ చాలా కామన్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బలమైన […]
బాలకృష్ణ హిట్ సినిమా లాక్కున్న ఎన్టీఆర్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కేరీర్‌లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్‌కు చాలా తక్కువ యేజ్‌లోనే తిరుగులేని స్టార్‌డమ్‌ను తీసుకువచ్చింది. 2003లో వచ్చిన సింహాద్రి అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. సింహాద్రి ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌ను చేస్తే, రాజమౌళిని స్టార్ డైరెక్టర్‌గా మార్చేసింది. ఈ సినిమాకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను ఎన్టీఆర్ […]