ఎన్టీఆర్ త‌ల్లి శాలిని గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, నంద‌మూరి హ‌రికృష్ణ భార్య శాలిని బ‌య‌ట ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హ‌రికృష్ణ ఆమెను లీగ‌ల్‌గా పెళ్లి చేసుకోలేద‌ని, స‌హ‌జీవ‌నం మాత్ర‌మే సాగించార‌ని చెబుతారు. చివ‌ర‌కు నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హ‌రికృష్ణ‌, శాలిని ఎప్పుడు, ఎక్క‌డ‌ క‌లిశారు? అస‌లు వీరి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న ర‌హ‌స్యాలు చాలా మందికి తెలియ‌దు. అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజ‌ర్‌. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్ల‌ల‌కు […]

ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్‌?!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో ప‌వ‌న్ తేజ్ కొణిదెల ఒక‌రు. కానీ, మెగా అభిమానులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో ప‌వ‌న్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు ప‌వ‌న్‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ త‌న రెండో సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. […]

మోక్షజ్ఞ ఎంట్రీపై బాల‌య్య‌ ఫుల్ క్లారిటీ..నిరాశ‌లో అభిమానులు!

బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెడ‌తాడా అని నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు త‌ప్పా.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌‌తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే తాజాగా త‌న‌యుడి ఎంట్రీ గురించి బాల‌య్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]

వారిపైనే ఆశ‌లు పెట్టుకున్న నంద‌మూరి హీరో..హిట్ కొట్టేనా?

`శ్రీమంతుడు` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర నిర్మాత సంస్థ‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూప‌ర్ డూప‌ర్ హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవ‌లె నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా […]

నంద‌మూరి ఫ్యామిలీని ఒక్క‌టి చేస్తోన్న ఎన్టీఆర్‌

ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో మార్చేసిన విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర త్వ‌రోనే వెండితెర‌కు ఎక్క‌నుంది. అన్న‌గారి గురించి తెలియంది ఎవ‌రికి? ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? అనే వారూ ఉన్నారు. అయితే, నేటి త‌రానికే కాదు.. పాత త‌రానికి కూడా తెలియ‌ని అనేక విష‌యాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకం ఉన్నాయి. విజ‌య‌వాడ ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల‌లో చ‌దువు ద‌గ్గ‌ర నుంచి గాంధీ న‌గర్‌లో పాలు అమ్మే వ‌ర‌కు… […]

నంద‌మూరి కుటుంబాన్ని వ‌దిలేస్తే.. బాబుకు క‌ష్ట‌మే!!

నంద‌మూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్ర‌బాబుకి మ‌ధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్ర‌చారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మ‌న‌వ‌డు, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భ‌విష్య‌త్తులో వారితో అవ‌స‌రం లేద‌ని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచ‌న‌లే వ‌స్తున్నాయ‌ట టీడీపీ కేడ‌ర్‌లో! దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభ‌మైన మ‌హానాడేన‌ని చ‌ర్చిస్తున్న‌వారు చెబుతున్నారు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం. టీడీపీ మ‌హానాడు శ‌నివారం విశాఖ‌లో ఘ‌నంగా […]

ఎన్టీఆర్ చుట్టూ స‌మాధానంలేని ప్ర‌శ్న‌లెన్నో

2009 ఎన్నిక‌ల తర్వాత‌ నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అలానే ఉన్నా.. స‌డ‌న్‌గా ఎలా వ‌చ్చిందో తెలియ‌దు కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌వ భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్టీఆర్‌.. పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని చెప్పినా.. మ‌రి ఎన్టీఆర్ పేరు వినిపించ‌డం వెనుక‌ ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకు మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను బుర‌ద‌లోకి లాగాల‌ని […]

ఫ్యామిలీ విష‌యంలో ప‌వ‌న్ – తార‌క్ ఒక‌టేనా..!

వాళ్లిద్ద‌రూ పెద్ద కుటుంబాల‌కు చెందిన‌వారు. ఒక‌రు సినీ హీరోగా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మ‌రొక‌రు రాజ‌కీయం, సినీ నేప‌థ్యం క‌ల‌గ‌ల‌సిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్ద‌రూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. ప‌రిస్థితులు ఇద్ద‌రినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మ‌రెవ‌రో కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చ‌ర్చ మొద‌లైంది. వీరిని గ‌మ‌నిస్తే..ఇద్ద‌రిలోనూ చాలా కామ‌న్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బ‌ల‌మైన […]

అందుకే ఫంక్ష‌న్‌ల‌కు ఎన్టీఆర్‌ను పిల‌వ‌డం లేద‌ట‌..

నారా-నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య దూరం త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో నిర్వహించిన పొలిట్ బ్యూరో స‌మావేశానికి నంద‌మూరి హ‌రికృష్ణ హాజరై.. బావ‌తో పాటు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో విభేదాలు త‌గ్గాయ‌ని అంతా భావించారు. కానీ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్.. మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ హాజ‌రైనా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాకపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు చంద్ర‌బాబు కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కూడా ఎన్టీఆర్ రాక‌పోవ‌డంతో […]