రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]
Tag: Modi
మోడీ మూడేళ్ల పాలనపై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టి మూడేళ్లవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్లలో ఎన్నో సక్సెస్ ఫుల్ విజయాలు అందుకున్నారు. అలాగే ఆయనకు కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ దిమ్మతిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్, తమిళనాడు, బిహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాలన పట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]
మోడీ రాజకీయం అదుర్స్ …మరి ఏం జరుగుతుందో చూడాలి!
పాలిటిక్స్‌లో ఎవరూ పర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండరనేది మరో సారి ప్రధాని మోడీ కూడా నిరూపించే ప్రయత్నంలో ఉన్నారా? అంటే ఔననే అనిపిస్తోంది. 2014లో చేతులు పట్టుకుని చెమ్మచెక్కలాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తెలంగాణలో తమకు గిట్టని, తమతో పొసగని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగస్వామి కాదు. అయినప్పటికీ.. మోడీ.. కేసీఆర్ సర్కార్ ఏం […]
తమిళనాట.. కమల వికాసం!… నిజం చేసిన పన్నీర్ ట్వీట్
తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయా? దక్షిణాదిలో కేవలం కర్ణాటక, ఏపీలతోనే సరిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తాజాగా తమిళనాడులోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతోందా? ఆ దిశగా ప్రధాని మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఆయనకు తమిళనాడు మాజీ సీఎం, అమ్మకు విధేయుడు పన్నీర్ సెల్వల మధ్య పొత్తు విషయంలో రాజీకుదిరిందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న పన్నీర్.. పెట్టిన ట్వీటే పెద్ద సాక్ష్యం. అయితే, ఆయన ప్రజాగ్రహానికి గురవ్వాల్సి […]
తెలంగాణలో కేసీఆర్.. ఒంటరవుతున్నారా..?
తెలంగాణలో తనకంటూ తిరుగులేదని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చక్కలు కనబడుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఆయనపై వ్యతిరేకత మొదలవుతోందా? ఇప్పుడు ఓ రకంగా తెలంగాణలో కేసీఆర్ ఒంటరి అవుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిరగబడుతోంది! ఎన్నికల సమయంలో బంగారు తెలంగాణ లక్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మటుకు ఇప్పటికీ నెరవేరకపోవడం దీనికి ప్రధాన […]
మాటలతో కానిది భేటీతో సాధ్యమైందా?
మాటల వల్ల చెప్పలేనిది మీటింగుల వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధాని మోదీతో ప్రతిపక్ష నేత జగన్ భేటీ.. ఏపీలో రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది. 2019లో జగన్ జైలుకు ఖాయమని, ఇక అధికారం శాశ్వతమని భావిస్తున్న నేతలకు ఒక్కసారిగా గొంతులో వెలగపండు పడినంత పనయింది. ఇదే సందర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
టీడీపీ నేతల అత్యుత్సాహం కొంపముంచుతోందా?
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని […]
టీడీపీకి షాక్: బీజేపీకి వైసీపీ మద్దతు
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మధ్య కలహాలు.. కొత్త పొత్తులు, వ్యూహాలతో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చూచాయగా ఒప్పుకున్నట్లు ఆసక్తికర కథనం చక్కెర్లు కొడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. ప్రతిపక్ష వైసీపీతో బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తోందనే […]