మంత్రి వర్గ విస్తరణ వేళ.. సీఎం చంద్రబాబు సరికొత్త టెన్షన్ మొదలైంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు దక్కవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమా చేరికను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం.. వైసీపీలో చేరవచ్చచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]
Tag: Minister
బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయన నియోజకవర్గంలోనూ ఆయనపై వ్యతిరేకత అధికమవుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి వెళ్లడంతో రావెలపై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవకాశమిచ్చినా రావెలలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక లోకేష్ కనుసన్నల్లోనే రావెల విధులు నిర్వర్తించేలా […]
ఏపీలో సీనియర్ మంత్రికే బెదిరింపులా..!
రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రుల తనయుల తీరు వివాదాస్పదంగా మారింది, కొంత కాలం నుంచి వివిధ మంత్రుల కొడుకుల తీరు టీడీపీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం ముగ్గురు మంత్రుల తనయులు ఒక సీనియర్ మంత్రికే ఝలక్ ఇచ్చారు. వారి ఆగడాలతో విసిగి వేశారిన ఆ సీనియర్ మంత్రి.. ఈ విషయంపై పార్టీ అధినేతకే ఫిర్యాదు చేసినా.. అక్కడా ఆయనకు చుక్కెదురైందని సమాచారం. తానేమీ కల్పించుకోలేనని.. నేరుగా ఆ మంత్రులతోనే మాట్లాడుకోవాలని చెప్పడంతో […]
కేటీఆర్‌పై బావ అనంతప్రేమ
తెలంగాణ మంత్రివర్గంలో బావ-బావమరుదులెవరో అందరికీ తెలిసిన విషయమే. వారిలో ఒకరు సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అయితే మరో వ్యక్తి భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు. టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ తర్వాత వారసత్వం కోసం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను పట్టుకోసం ఎత్తులు వేస్తున్నారన్న వార్తలపై ఎప్పటికప్పుడు వారు క్లారిటీ ఇస్తున్నా ఈ పుకార్లు మాత్రం షికార్లు […]
ఆ మంత్రి పోస్ట్ ఊస్టింగ్‌పై లోకేశ్ సిగ్నల్స్
ఏపీ మంత్రి రావెలకి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందా? ప్రస్తుతం దావోస్‌లో ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి రాగానే మంత్రి వర్యులను మర్యాదగా ఇంటికి సాగనంపుతారా? ఇన్నాళ్లూ.. పదవిని చూసుకుని రెచ్చిపోయిన రావెల ఇక పదవీచ్యుతుడై.. తన నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యేగా మిగులుతారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గత కొన్నాళ్లుగా సొంత పార్టీలోనే రావెలకు వ్యతిరేకత ఎక్కువైంది. అయినవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ అన్నచందంగా పార్టీ కోసం అహరహం శ్రమించిన […]
కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి కట్టబెడతారని గంపెడాశలు పెట్టుకున్నారు నేతలు! అయితే ఇప్పుడు ఆ ఆశలపై బాబు నీళ్లు చల్లారు. అంతేగాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తే పార్టీలో మరింత కీలకంగా వ్యవహరించాలని ఎదురుచూస్తున్న చినబాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే దీనికి లోకేష్ వ్యవహార శైలే కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొద్దికాలంగా లోకేష్ తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన్ను ఎమ్మెల్సీ పదవికి […]
లోకేష్‌కు మంత్రి పదవి బాబు అందుకే ఇవ్వట్లేదా
ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబులపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా మాటలతో విరుచుకుపడింది. గతానికి భిన్నంగా ఇద్దరు నేతలను క లిపి కుమ్మేసింది. చౌకబారు విమర్శలు పక్కనపెట్టి.. నిఖార్సైన వ్యాఖ్యలతో చించొదిలి పెట్టింది. ఇంతకీ రోజా ఏమందనేగా సందేహం.. అక్కడికే వచ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా తన మాటలకు మరింత మషాళా అద్ది.. సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు లోకేష్ […]
ఏపీలో తెలుగు భాష పీక నొక్కుతున్న మంత్రి
దేశ భాషలందు తెలుగు లెస్స! అన్న కృష్ణదేవరాయులు.. తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రమనే పేరును చంద్రబాబు ప్రభుత్వం తుడిచి పెట్టేయాలని చూస్తోందనే విమర్శలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగవుతున్న భాషల్లో ఒకటిగా ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్న విషయం తెలిసింది. అలాంటి సమయంలో మరింతగా తెలుగును పోషించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. […]
గంటా ఆస్తుల్లో ప్రభుత్వ భూములు..!
ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్రభుత్వ భూములు ఆయన ఆస్తుల జాబితాలో ఉండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయనేమన్నా ఆ ఆస్తులను కొనుగోలు చేశారా? అంటే లేదని ఆక్రమించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పలువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]