చాలా మంది సినీ నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు […]
Tag: Latest news
చిరంజీవి బర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య`..త్వరలోనే ప్రకటన!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా..ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, కరోనా దెబ్బకు షూటింగ్‌కు బ్రేక్ పడడంతో.. విడుదలను వాయిదా వేశారు. […]
వార్నర్ చేసిని పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ […]
థియేటర్లలో బోల్తా పడినా అక్కడ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్`!
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంటనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుదల చేశారు. […]
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మహేష్..ప్రజలకు మరో విజ్ఞప్తి!
ప్రస్తుతం కరోనా వైరస్ ఊహించని రీతిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే ఎందరో ప్రాణాలు విడవగా.. మరెందరో హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మహేష్.. ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా […]
దేశంలో 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,52,991 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకుంది. అలాగే నిన్న 2,812 మంది […]
బాలయ్య డైరెక్టర్‌కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేస్తాడు అన్నది […]
తెలంగాణలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..అక్కడే అత్యధికం!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
టీడీపీలో మరో విషాదం..కరోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వికృత రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా.. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గత […]