సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, కుష్బూ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే రజనీ అమెరికాకు పయనమవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో […]
Tag: Latest news
నెటిజన్ల తిట్లకు బెదిరిపోయిన జాన్వీ..తీవ్ర ఆవేదన!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. ఇటీవల బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాన్వీ సూపర్ హాట్‌గా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు జాన్వీపై విమర్శలు వ్యక్తం చేశారు. కరోనాతో దేశం […]
కరోనా దెబ్బకు తోటల్లోనే ఉంటున్న ప్రముఖ హీరోయిన్!
దేశ ప్రజలను మళ్లీ కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. ఇక కరోనా దెబ్బకు భయపడిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహీ చావ్లా ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటల్లోనే నివాసం ఉంటోంది. అక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే […]
ఏపీలో ఆగని కరోనా బీభత్సం..20వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు. నివేదా థామస్, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్‌వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు […]
ఏపీ ప్రజలను అలర్ట్.. రేపటి నుంచే కర్ఫ్యూ అమలు!
తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం […]
టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక విషాదాన్ని జీర్ణించుకోకముందే.. మరో విషాదం జరిగిపోతుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా అనిత మృతి చెందారు. అనిత అకాల మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!
ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప`రాజ్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్పరాజ్‌ను పరిచయం చేస్తూ బన్నీ బర్త్‌డే నాడు పుష్ప టీజర్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. అయితే తాజాగా ఈ టీజర్ ఫస్ట్ అండ్ […]