బ‌న్నీ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న సుక్కు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట సుక్కు. ఇంత‌కీ విష‌యం […]

గర్భవతి అని తెలియ‌దు..కానీ, బిడ్డ పుట్టేసింది!

మాతృత్వం ఎంత గొప్ప‌దో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. అందుకే పెళ్లైన ప్ర‌తి స్త్రీ గ‌ర్భం దాల్చాల‌ని.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ నివ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ విచిత్ర‌, వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం తెలియ‌కుండానే ఓ మ‌హిళ‌కు బిడ్డ పుట్టేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందిన లావినియా మౌంగ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకని హవాయిలోని హనలూలూకి ఫైట్‌లో బయల్దేరింది. ప్రయాణంలో ఆమెకు ఒక్కసారిగా కడుపులో నొప్పులు […]

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వ‌ర‌ప‌డండి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. అయితే ప‌లు అపోహ‌లు కార‌ణంగా యువ‌త వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో..ప్ర‌భుత్వాలు వినూత్న ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్‌ను ఫ్రీగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా త‌మ‌న్నా `న‌వంబ‌ర్ స్టోరీ` ట్రైల‌ర్‌!

క‌రోనా కార‌ణంగా ఓటీటీల హ‌వా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ బాట ప‌డుతున్నారు. ఇక ఇటీవ‌లె లెవెంత్ అవ‌ర్ వెబ్ సిరీస్‌తో ప‌ల‌క‌రించిన త‌మ‌న్నా.. తాజాగా మ‌రో వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. తమిళంలో త‌మ‌న్నా న‌టించిన తాజా వెబ్ సిరీస్ నవంబర్‌ స్టోరీ. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లోనూ ప్ర‌ముఖ […]

బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం […]

త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు మ‌హేష్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ […]

క‌రోనాతో తండ్రి మృతి..కూతురు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశంలో మ‌ళ్లీ ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా, తీవ్రంగా మారిన క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. తాజాగా పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది కూతురు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో నివసిస్తున్న దామోదర్ దాస్ క‌రోనా […]

దేశంలో త‌గ్గిన క‌రోనా జోరు..భారీగా న‌మోదైన కొత్త కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,82,315 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148 కు చేరుకుంది. అలాగే నిన్న 3,780 మంది […]

తెలంగాణ‌లో కొత్త‌గా 6,361 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు […]