తాప్సీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శభాస్ మిథూ ఒకటి. భారత మహిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాహుల్ డొలకియా […]
Tag: Latest news
రామ్ చరణ్ నిర్మాణంలో రవితేజ సినిమా..త్వరలోనే ప్రకటన?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాలన్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..98 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ట్విట్టర్‌కు నోటీసులు జారీ..!
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల విషయంలో ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా సైట్ లో కనిపించడం లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మే 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త […]
కథల కోసం మహేష్ డైరెక్టర్ కష్టాలు..అందుకే ఆలస్యమట!
వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను […]
మృతదేహాల కోసం సోనూసూద్ కీలక నిర్ణయం!?
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతోంది. కరోనా కష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. కనివిని ఎరుగని రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో సాయం కోసం ఆయా గ్రామాల సర్పంచులు ఇటీవల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. […]
ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న కోటయ్య మృతి!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మెరుగుపడని తన ఆరోగ్యం ఆనందయ్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుపడిందని ఇటీవల కోటయ్య స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. కానీ, ఈ వెంటనే ఆయన ఆరోగ్యం […]
కరోనా బారినపడ్డ అత్త.. కోడలిని ఏం చేసిందో తెలిస్తే షాకే!
కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ […]
శ్రీముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?
బుల్లితర హాట్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ఈ షో తర్వాత టీవీ షోలు, పలు సినిమాలతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీముఖి […]