ఆ హిట్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన మెగా మేన‌ల్లుడు?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఇటీవ‌లె ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్ దర్శ‌క‌త్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణ‌వ్‌.. మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో డైరెక్ట‌ర్‌కు కూడా వైష్ణ‌వ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఛ‌లో, భీష్మ […]

భార‌త్‌లో 2 కోట్లు దాటిన క‌రోనా కేసులు..3,449 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,57,229 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833 కు చేరుకుంది. అలాగే నిన్న 3,449 మంది […]

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..59 మంది మృతి!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు […]

క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో […]

మ‌రో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప్ర‌స్త‌తం విక్ట‌రీ వెంక‌టేష్ వ‌రుస రీమేక్‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈయన నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన అసురన్‌కు రీమేక్‌. అలాగే ఇటీవ‌లె దృశ్యం 2 చిత్రాన్ని సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు వెంకీ. ఈ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2కు రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే మలయాళ […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ అదేన‌ట‌?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవ‌లె అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న చిత్రం కావ‌డంతో.. అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా […]

అఖండ‌లో గెస్ట్ రోల్‌..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్ […]

వైవాహిక జీవితానికి గుడ్‌బై..విడిపోతున్న‌ బిల్‌గేట్స్‌ దంపతులు!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు..వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని మిలిందా గేట్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మేము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ […]

కీర్తి సురేష్‌ తొలి సంపాద‌న ఎంతో తెలుసా?

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన‌ కీర్తి సురేష్‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రంతో వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్న ఈ బ్యూటీ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత‌ ఒక్కో సినిమాకు కోట్లు పుచ్చుకుంటున్న కీర్తి.. తొలి సంపాద‌న కేవ‌లం రూ. 500 వంద‌ల‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కీర్తినే […]