కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!

తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు పెట్టుకుంది. దీన్ని కే‌సి‌ఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]

పవన్ గ్రాఫ్ పెంచుతున్న కేవీపీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవీపీ రామచంద్రరావు గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. వైఎస్సార్ సన్నిహితుడుగా మెలిగిన కేవీపీ..గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ అనే విధంగా రాజకీయం నడిచింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కేవీపీ..రాజకీయం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుంది. జగన్ వేరే పార్టీ పెట్టినా సరే…అటువైపుకు కేవీపీ వెళ్లలేదు. మరి పరోక్షంగా ఏమైనా సహకారం అందించారేమో గాని..ప్రత్యక్షంగా జగన్ వైపు చూడటం లేదు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు..రెండు రాష్ట్రాల్లో […]

జగన్ తో పెద్దాయన డీల్ షురూ!  ఇక కండువా మారుడే!

వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జ‌గ‌న్ చెంత‌కు చేర‌నున్నారా? త‌్వ‌ర‌లోనే కాంగ్రెస్‌కు రాం రాం ప‌ల‌క‌నున్నారా? ఏపీలో జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే ధ్యేయంగా ఆయ‌న వైసీపీ ని ముందుండి న‌డిపిస్తారా? ఇప్ప‌టికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది లోట‌స్ పాండ్ వ‌ర్గాల నుంచి. విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాడు జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలో ఆయ‌న బిహార్ నుంచి ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిశోర్‌ని […]

కేవీపీ, కేసీఆర్ దోస్తానా

“కేవీపీ రామ‌చంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల గురించి అవ‌గాహ‌న ఉన్నవారికి ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజ‌ల‌కే దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు సైతం తెలుసు. సిద్ధాంత‌ప‌రంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేత‌ల మ‌ధ్య మంచీ దోస్తీ ఉంద‌నే వార్తలు కొద్దికాలంగా వెలువ‌డుతున్నాయి. అయితే ఇది మ‌రింత‌గా బ‌ల‌ప‌డింద‌ని […]