RRR కి పోటీగా బరిలో నిలవనున్న 6 సినిమాలు..అంత దమ్ము ఎక్కడిది ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఈనెల లోనే విడుదల కావాల్సి ఉంది. జనాలు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు కూడా. అయితే ఏంజరిగిందో తెలియదు కానీ.. చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా వాయిదాతో మిగతా సినిమాల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడో రావాల్సిన సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలిచాయి. అటు సమ్మర్ సినిమాలపై నా మూవీ మేకర్స్ స్పెషల్ […]

ఎలాంటి మార్పు లేదంటున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలోనే వచ్చిన కన్నడ భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, కన్నడ హీరో యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ […]

కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్ర‌భాస్ `స‌లార్‌`..పండక్కే విడుద‌ల‌ట‌?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, అదే తేదీని ప్ర‌శాంత్ నీల్, […]

అదిరిపోయిన‌ `కేజీఎఫ్‌-2` న్యూ పోస్ట‌ర్‌!

రాక్ స్టార్ య‌శ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వ‌చ్చిన కేజీఎఫ్.. దేశ‌వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2ను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్​ దత్ అధీరాగా విలన్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజ‌య్ ద‌త్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్ర‌కు సంబంధించి న్యూ […]

కేజీయఫ్ 2” రిలీజ్ పై న్యూ అప్డేట్….నిజమెంత అంటే..?

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజిఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సూపర్ హిట్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావడం.. అలాగే దానికి సంబంధించిన పనులు అన్ని కూడా పూర్తి అయ్యాయని.. కాకపోతే, covid 19 వైరస్ కారణంగా […]

కేజీఎఫ్ 2లో రావు రమేష్ పాత్ర అదేన‌ట‌!

కోలీవుడ్ రాక్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్‌2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్‌ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ కూడా […]

kgf2

దసరా కానుకగా కెజియఫ్‌ 2..?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీయఫ్‌’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’. ఈ సినిమా జులై 16న తెరపైకి రావాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో థియేటర్ల మూతపడాయి. అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు […]

ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?

యష్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌-చాప్టర్‌ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్‌-2 చిత్రం సీక్వెల్‌ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్‌ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నర్తించనున్నట్లు […]