ఫామ్ హౌస్ CM పనయిపోయింది..

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఖమ్మం ఆడ పడుచు రేణుకా చౌదరి దే.అయితే రాష్ట్ర విభజన అనంతరం రేణుకలో మునుపటి వాడి కనిపించలేదు.దానికి కారణాలేవయినా రేణుకా మాత్రం అడపా దడపా మీడియా ముందు కనపడటం మినహా చెప్పుకోదగ్గ విమర్సనాస్త్రాలు మాత్రం సంధించలేదు. అయితే తాజాగా సినిమా స్టయిల్లో తెలంగాణా ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రేణుకా.పెన్షన్లకు,ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బుల్లేవంటారు కానీ బతుకమ్మకు మాత్రం బడా బడ్జెట్ ఉంటుంది.అయినా కెసిఆర్ ఫామ్ […]

కేవీపీ, కేసీఆర్ దోస్తానా

“కేవీపీ రామ‌చంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల గురించి అవ‌గాహ‌న ఉన్నవారికి ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజ‌ల‌కే దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు సైతం తెలుసు. సిద్ధాంత‌ప‌రంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేత‌ల మ‌ధ్య మంచీ దోస్తీ ఉంద‌నే వార్తలు కొద్దికాలంగా వెలువ‌డుతున్నాయి. అయితే ఇది మ‌రింత‌గా బ‌ల‌ప‌డింద‌ని […]

కొత్త జిల్లాలు దసరాకే పక్కా

తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్‌, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]

మాట తప్పేది లేదంటున్న కెసియార్‌

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్‌ సమయం తీసుకున్నారు. […]

దేవాలయాలు కూడానా కెసిఆర్ గారూ

కెసిఆర్ లోని ఉద్యమనేత ఇంకా చల్లారినట్లు లేడు.అయన ఇప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పుడప్పుడు నేనింకా ఉద్యమనేతనే అని అందరికి గుర్తు చేస్తుంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్.ఉద్యమనేతగా చాలా కలం కొనసాగి ఆ అలవాట్లు ఇంకా పోలేదో లేక నేను ముఖ్యమంత్రినైనా నాలో ఉద్యమ నాయకుడే ఎప్పుడు ముందుంటాడని చుపించాడానికో తెలీదు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఏకంగా బంద్ కి పిలుపునివ్వడం ఎక్కడైనా చూశామా.అది కేవలం కెసిఆర్ కె సాధ్యం.ఖమ్మం జిల్లా లోని 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో […]

కెసియార్‌ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?

గ్యాంగ్‌స్టర్‌ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు. పోలీసులు సేఫ్‌ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో […]

కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రా…

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు […]

మోడీ టూర్‌పై కేసీఆర్‌ వ్యూహాలేంటో!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]