గవర్నర్ సమక్షంలో మరోసారి ఇద్దరు చంద్రులు కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని సానుకూలంగా చర్చించుకున్నారు!! మరోసారి వీరి కలయికకు వేదికగా మారింది ఎట్ హోం కార్యక్రమం! ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీఎంలు.. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హైకోర్టు విభజనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కలుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నారనే అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం […]
Tag: KCR
కేసీఆర్ పై పోరుకు రేవంత్ కొత్త ఆయుధాలు!
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే టీ టీడీపీకి చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా తన ధాటిని మరింతగా పెంచినట్టు తెలుస్తోంది. ఓటు కోట్లు కేసు తర్వాత కేసీఆర్ తనను కావాలనే జైలుకు పంపారని ఆరోపిస్తూ.. గేమ్ స్టార్టయింది! అంటూ పెద్ద ఎత్తున పత్రికలకు స్టేట్ మెంట్ ఇచ్చిన రేవంత్ ఆ తర్వాత తన దూకుడును పెంచాడు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనినీ విమర్శిస్తూ.. తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు రేవంత్ ఎంతో […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సర్వే భయం
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బాట పట్టినట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం? వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తే.. ఎంత వరకు నెగ్గుతారు? వంటి పలు విషయాలపై చంద్రబాబు మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా తన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై సర్వే చేయించారట. ప్రస్తుతం ఈ విషయంపైనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. సర్వేలో ఫెయిల్ అయిన […]
టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ప్రయారిటీ ఏంటి?
ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా తానై మేనమామ కేసీఆర్ చెప్పినట్టు నడుచుకొన్న ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి తెలంగాణలో ఏ సమస్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్‌లోకి దూసుకుపోయి.. సమస్యలను పరిష్కరించడంలో హరీష్.. తన స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనను తొక్కేస్తున్నారనే టాక్ వినబడుతోంది. టీఆర్ ఎస్‌లో ఆధిపత్య పోరు మొదలైనప్పటి నుంచి పరోక్షంగా హరీష్‌ను తెరవెనుకకే పరిమితం […]
కోదండరాం పార్టీతో టీఆర్ఎస్‌కు ఎఫెక్ట్ ఎంత
దేశంలో ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి పట్టుబట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో రికార్డు సృష్టించనుందనే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటికల్‌గా తెలంగాణ మరో యూ టర్న్ తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో అన్నీతానై మేధావులను కదిలించి నిత్యం పత్రికల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టికల్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు సరికొత్తగా పార్టీకి శ్రీకారం చుడుతున్నారనే వార్తలు […]
కేటీఆర్ కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో ఇప్పుడు వారసత్వ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల మధ్య జరిగిన రాజకీయ రగడ నేపథ్యంలో తెలంగాణలోనూ పరిస్థితి ఆదిశగా దారితీస్తుందా? అని అందరూ చర్చించుకున్నారు. అయితే, అలాంటి పరిస్థితి రాదని, కేసీఆర్ పక్కా వ్యూహంతోనే ఉన్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పొసుకున్న టీఆర్ ఎస్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ తొలిసీఎంగా […]
ఎమ్మెల్యేలను ఇరుకున పడేసిన కేసీఆర్
`తెలంగాణలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం` అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ముఖ్యంగా ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది కూడా! అయితే ఇప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం వల్ల ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఈ నిర్ణయం ఇప్పుడు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. తమ నియోజకవర్గాల్లో ఎప్పుడు డబుల్ నిర్మాణం పూర్తవుతుందో అని.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో […]
కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్టర్ ఫైర్
తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వర్గం తీవ్రస్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ లక్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మరిచిపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు సంధించింది. తాజాగా బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద పన్నును మినహాయించడంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మండిపడుతోంది. ఆంధ్రావాళ్లపై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోందని, వాళ్లు ఏదైనా ప్రపోజల్‌తో సీఎం కలిస్తే.. వెంటనే పనులు అయిపోతున్నాయని, తెలంగాణ కోసం […]
కేసీఆర్‌కి మరోసారి హైకోర్టు జలక్!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర భూసేకరణ చట్టంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించడంతోపాటు దీని అమలుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ సర్కారుకు శరాఘాతమనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత తన దంటూ ప్రత్యేక పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే […]