తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే.. ఇప్పటి నుంచే పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలో.. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఒక చోటకు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా కమ్యూనిస్టులు ఈ విషయంలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన రంగ ప్రవేశంతో.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఎలాగైనా పూర్వ వైభవాన్ని సంపాదించాలని కమ్యూనిస్టులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ […]
Tag: KCR
బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్ఠానం దక్షిణాధి రాష్ట్రాలపై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్యలను మొదట పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియస్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. ఆయనలో గుబులు మొదలైందట. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ వ్యూహాలకు చెక్ […]
కేటీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కవిత..!
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ వాణి బలంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న సమస్యలపై ఆమె లోక్‌సభలో తన వాగ్దాటిని బలంగానే వినిపిస్తున్నారన్న చర్చలు కూడా టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని దాదాపు యేడాది కాలంగా ఒక్కటే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుందని…మోడీ టీఆర్ఎస్‌కు రెండు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారని..అందులో ఒకటి కవితకేనన్న ప్రచారం […]
రామోజీతో కేసీఆర్ రాజీ… ఫిల్మ్‌సిటీ అక్కౌంట్‌లోకి వందల ఎకరాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఒకటి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది!! తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ నోటితో అయితే రామోజీని తిట్టిపోసి.. ఆయన కట్టుకున్న స్వతంత్ర రాజ్యం ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు అదే రామోజీకి దాసోహం అయిపోయారా? అని తెలంగాణ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీకి రంగారెడ్డి జిల్లాలోని అనాజ్‌పూర్ సహా చుట్టుపక్కల సుమారు 375 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా కట్టబెడుతున్నారు. ఇప్పుడు […]
కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్న ఏపీ విస్త`రణం`
ఏపీలో విస్తరణ సెగలు పూర్తిగా చల్లారలేదు. అధినేత చంద్రబాబు.. ఈ జ్వాలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీనియర్లకు ఇప్పుడు మొండిచేయి ఎదురవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్నాయట. త్వరలో తెలంగాణలోనూ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తే.. అసంతృప్తులను ఏవిధంగా చల్లార్చాలనే అంశాలపై […]
కేసీఆర్‌తో జ్యోతి రాధాకృష్ణ రాజీ..!
ఏకంగా 365 రోజుల పాటు ఒక చానల్‌పై నిషేధం! దీనిపై వరుసగా పత్రికల్లో అలుపెరగని పోరాటాలు! ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక కథనాలు.. ఎటు చూసినా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహారం!! సీన్ కట్ చేస్తే.. తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. ఆ చానల్‌కు చెందిన పత్రికల్లో ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసే కథనాలు! పాలన అంతా సుభిక్షం.. ఇలా అయితే త్వరలోనే బంగారు తెలంగాణ సాధ్యమనేంతగా పొడగ్తలు! ఇదీ ఆంధ్రజ్యోతి పత్రిక వ్యవహారశైలి. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం […]
కాంగ్రెస్ దూకుడుకు `సెంటిమెంట్`తో టీఆర్ఎస్ కళ్లెం
తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. నాయకులు కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ బయటకు తీసింది. తెలంగాణ వాదాన్ని మరోసారి వినిపించాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రజలను మరోసారి తమ సెంటిమెంట్ బంధాల్లో కట్టేయడానికి కేసీఆర్ అండ్ కో సిద్ధమైంది. తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిందే టీఆర్ఎస్ అని.. మిగిలిన పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని నమ్మబలికే ప్రయత్నం […]
త్వరలో గులాబీ గూటికి డీకే అరుణ వర్గం
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సీఎం కేసీఆర్‌కు వరంలా మారుతోంది, ఇప్పటికే తెలుగుదేశం పార్టీని ఆపరేషన్ ఆకర్ష్‌తో ఖాళీ చేసిన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్‌పై దృష్టిపెట్టబోతున్నారట. కాగల కార్యం గంధర్వులే తీర్చిన విధంగా.. కాంగ్రెస్‌లో లుకలుకలు ఆయన పని మరింత సులభం చేస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ అంటే ఒంటి కాలిపై లేచే.. డీ కే అరుణ వర్గానికి ఇప్పుడు కేసీఆర్ గేలం వేస్తున్నారని సమాచారం! ఆమె వర్గానికి చెందిన నేతలంతా కేసీఆర్‌ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో […]
కేసీఆర్ `ముందస్తు` వెనుక అసలు కారణమిదే
ముందస్తు ఎన్నికలు.. ఇప్పుడు తెలంగాణలో జోరుగా వినిపిస్తున్న మాట. వ్యూహాల్లో ఎవరికీ అందకుండా ప్రత్యర్థులను చిత్తు చేసే సీఎం కేసీఆర్.. ముందస్తు ఎన్నిక లగురించి ఎందుకు ఆలోచిస్తున్నట్లు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన ఎన్నికల గురించి నిర్వహించిన సర్వేలో ఆసక్తికర మైన అంశాలు బయటపడ్డాయట. అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించి మళ్లీ అధికారిన్ని చేజిక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ఈ ముందస్తు ఎన్నికల వ్యూహానికి తెరతీశారట. తెలంగాణలో ప్రతిపక్షం బలపడుతోంది. […]