బాహుబ‌లిపై కేసీఆర్ క‌క్ష తీర్చుకున్నాడా..!

ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు ఇలా ప్ర‌వర్తిస్తోంది? తెలుగు సినిమా గురించి దేశంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు వేనోళ్ల పొగుడుతున్న వేళ‌.. టీఆర్ఎస్ నాయ‌కులు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ సినిమా విష‌యంలో కాస్త డిఫ‌రెంట్‌గా ప్ర‌వ‌రిస్తున్నారా ? అన్న సందేహాలు అంద‌రి మ‌దిలోను క‌లుగుతున్నాయి. మొన్న‌టికి మొన్న `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` సినిమాకు, అంత‌కుముందు రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం.. ఇప్పుడు `బాహుబ‌లి-2` సినిమాకు రాయితీలు ఇవ్వ‌క‌పోవ‌డంతో […]

ముంద‌స్తుకు సై అన‌డం వెనుక వ్యూహమిదే

ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బడుతున్నాయి. తెలంగాణ బంగారు తెలంగాణ‌గా మార్చేందుకు నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లకు రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. అప్పుడే మూడేళ్లు అయిపోయాయా అనే భావ‌న అంద‌రిలోనూ ఉంది. కానీ మ‌రోసారి ఎన్నిక‌ల‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు సై అంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లోనే కాక‌.. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఫీవ‌ర్ పెంచేశారు. ఎన్నిక‌ల హామీలు ఇంకా నెర‌వేర్చ‌లేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన‌వి.. ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. కానీ ముంద‌స్తుకు ప్ర‌ధాని మోదీ.. ఓకే అన‌గానే ఇద్ద‌రు […]

టీఆర్ఎస్‌లో బాబు మోహ‌న్ ప‌నైపోయిందా..!

సినీన‌టుడు బాబు మోహ‌న్‌.. టీఆర్ఎస్‌లో చేరి ఆందోల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయ‌కులంద‌రితోనూ ఆయ‌న‌కు స‌త్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో బాబూ మోహ‌న్‌కు అతి త‌క్కువ మార్కులే రావ‌డం.. ఆయ‌నకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయ‌న నియోజ‌కవ‌ర్గంలో కాంగ్రెస్ నేత‌, మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక టీఆర్ఎస్‌లో ఆయ‌న శ‌కం దాదాపు ముగిసిన‌ట్టేన‌నే […]

బీజేపీకి ప్ల‌స్‌.. కేసీఆర్‌కు మైన‌స్‌

ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న వ్యూహాల‌తో చిత్తు చేయ‌గ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తాను తీసుకున్న గోతులో తానే ప‌డబోతున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను ఇరుకున పెట్ట‌బోయి.. తానే ఇరుక్క‌బోతున్నారా అని విశ్లేష‌కులు సందేహ‌ప‌డుతున్నారు. మైనారిటీల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం.. కేసీఆర్‌కు లాభం చేకూర్చ‌బోయి.. న‌ష్టం క‌లిగిస్తుందా అనే ఆందోళ‌న మొదలైంది. బీజేపీని ఇబ్బంది పెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని తీసుకున్న నిర్ణ‌యం బూమ‌రాంగ్ అయ్యే అవ‌కాశాలున్నాయనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. 2014లోగానీ,మొన్న‌టి యూపీ ఎన్నిక‌ల్లో గానీ బీజేపీ అధికారంలోకి […]

టీఆర్ఎస్‌లో ఏదో జ‌రుగుతోందా..?

తన త‌ర్వాత సీఎం పీఠం కొడుకు, లేదా కూతురికి అప్ప‌గిస్తున్న వారే ఎక్కువ‌మంది క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ వార‌స‌త్వ రాజ‌కీయం ప్ర‌ధానంగా మారిపోయింది. సీఎం పీఠానికి ఎవ‌రైనా అడ్డొస్తున్నార‌ని తెలిస్తే.. వారిని వెంట‌నే ప‌క్కకు తొల‌గించేస్తున్న రోజులివి. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇదే ప‌ద్ధ‌తి క‌నిపిస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు చూసిన వారంతా ఇదే చెబుతున్నారు. మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు ప్రాధాన్యం త‌గ్గించి.. కొడుకును వీలైనంతగా ప్రొజెక్టుచేయాల‌ని చూస్తున్నారు కేసీఆర్‌. అంతేగాక వీలైనంత‌గా ప్ర‌జ‌ల్లో ప‌ట్టు […]

చంద్ర‌బాబు త‌ల‌నొప్పులు వ‌ద్దంటోన్న కేసీఆర్‌..!

ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే పూర్త‌య్యింది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చాలా సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువైంది. సంచ‌ల‌నాలు అనేకంటే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించ‌ని వారికి అనూహ్యంగా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కితే…మంత్రి ప‌ద‌వి ఆశ‌లు పెట్టుకున్న వారికి మొండిచేయి ఎదురైంది. దీంతో మంత్రి ప‌ద‌వి రాని సీనియ‌ర్లు రాజీనామాల అస్త్రాలు సంధించ‌డంతో ఏపీ రాజ‌కీయం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారి ఒక్క‌సారిగా హీటెక్కింది. ఇక మంత్రి వ‌ర్గం నుంచి ఊస్టింగ్‌కు గురైన సీనియ‌ర్ […]

మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క […]

కేసీఆర్ వ్యూహం తెలిస్తే బీజేపీకి నిద్ర ప‌ట్ట‌దేమో..

రాజ‌కీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంత‌టి నేర్పరో ఇప్ప‌టికే అంద‌రూ ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు. ఆయ‌న ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప‌క్క తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పావులు క‌దుపుతుండ‌టంతో.. ఇప్పుడు ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే కాలేదు.. ఇప్పుడో కేసీఆర్ ప‌రిస్థితి కూడా అంతే అనేవాళ్లూ లేక‌పోలేదు. ఈ మాత్రం తెలియ‌కుండా ప‌దేప‌దే ఈ అంశంపై మాట్లాడటం వెనుక […]

కేసీఆర్‌ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు కంటి నిండా నిద్ర క‌రువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ స‌ర్వే జ‌రుగుతుందో… అందులో తాము ఎక్క‌డ ఉంటామో తెలియ‌క అంతా స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇక ఈ స‌ర్వే ఫ‌లితాలే 2019 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు కొల‌మాన‌మ‌ని చెబుతుండ‌టంతో.. ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. `పార్టీ ప‌రిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండ‌టంతో.. ఎక్క‌డ […]