మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్‌

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో […]

ఈటల వింత వాదన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను […]

ప్లాన్ – బీ అమలు చేసిన అధినేత

చదరంగమైనా.. రాజకీయమైనా ఎత్తులు..పై ఎత్తులు ఉంటాయి.. ప్రత్యర్థి వేసే ఎత్తును ఊహించి మనం స్టెప్ వేయాలి.. లేకపోతే అంతే.. ఒక్కసారిగా చెక్ పడిపోతుంది.. ఆ తరువాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి విషయాల్లో రాజకీయ ఉద్ధండుడు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యర్థి వేసే ఎత్తుకు మరో రెండు, మూడు స్టెప్స్ ముందే ఊహించి ప్లాన్ రూపొందిస్తారు. అవే ప్లాన్ -ఏ, ప్లాన్- బీ.. ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ – ఏ ను అమలు […]

ఢిల్లీకే కవిత.. ఇదే కన్ఫర్మ్

ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోతోంది.. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి..అయితే.. మండలిలోకి మళ్లీ ఏం వెళతాం అనే అభిప్రాయంలో ఉన్నారు సీఎం కూతురు కల్వకుంట్ల కవిత. మరేం చేద్దాం.. ఏదో ఒక చట్టసభలో ఆమెకు స్థానం కావాలి.. రాజ్యసభకు పంపిద్దాం.. అరె.. అక్కడ ఖాళీల్లేవుగా.. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ముక్క పడాల్సిందే.. ఇపుడు అచ్చం తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. ఆ పార్టీకి చీఫ్, ప్రభుత్వానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు […]

కారు కావాలా.. కియా కార్నివాల్ ఉందిగా..

పార్టీ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు కోపం, ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు.. అర్థం కాదు.. కోపం వచ్చిన వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది.. ప్రేమ చూపిన మరుక్షణమే కోపంగా మారిపోతారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం కష్టం. సరే అనడం తప్ప ఏమీ చేయరాదు. ఇంతకీ అసలు విషయమేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కియా కార్ కార్నివాల్ అంటే ఎందుకో ప్రేమ ఎక్కువైన్నట్లుంది. కారు అంటేనే కియా కార్నివాల్.. ఇక ప్రపంచంలో అంతకుమించి కార్లున్నాయా.. దానిని కాక దేనిని […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]

ఐఏఎస్ వద్దు..రాజకీయాలే ముద్దు?

పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. వివిధ హోదాల్లో ప్రజాసేవ.. గ్రూప్ 1 అధికారిగా ఎంపిక.. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీఓగా విధి నిర్వహణ, 2007లో ఐఏఎస్ హోదా.. డ్వామా పీడీ, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం, ఆ తరువాత కన్ఫర్మ్డ ఐఏఎస్ గా పదోన్నతి.. జేసీగా పనిచేసిన వ్యక్తి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ గా ప్రజాసేవ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఆయనే వెంకట్రామరెడ్డి.. ఇందులో ఏముంది.. అంత […]