దాదాపు 40 ఏళ్లకు పైగా వైఎస్ వంశానికి కంచుకోటగా ఉన్న కడపలో ఇప్పుడు టీడీపీ జెండా ఎగరబోతోందా? చంద్రబాబు ముందుగానే గీసుకున్న స్కెచ్ ప్రకారం జగన్ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టబోతోందా? 2019కి ముందుగానే ఎమ్మెల్సీ రూపంలో జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేయబోతోందా? ఎంతైనా కష్టపడి కడపలో కాలు మోపడం ద్వారా జగన్ కూసాలు కదిలించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది అంటున్నారు టీడీపీ నేతలు.. మంత్రులు. ప్రస్తుతం తెరలేచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు […]
Tag: Jagan
వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ నేతృత్వలోని వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా జగన్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పురందేశ్వరి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత, సీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా జగన్ పంచకే చేరుతున్నట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాటని స్వయంగా డీఎల్ వెల్లడించడం సంచలనం సృష్టించింది. తాను త్వరలోనే జగన్ పార్టీలోకి చేరుతున్నానని, జగన్ బాటలో నడుస్తానని […]
వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి
ప్రస్తుత రాజకీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవకాశం వచ్చినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయకులే ఎక్కువ! ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేతలోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు పడవల ప్రయాణం చేస్తున్న వారే అధికం!! ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్యవహరిస్తుండటంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]
ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు
ఏపీ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను తన పార్టీలో చేర్చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల వారసులు వరుసగా జగన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు కర్నూలు జిల్లాకు […]
జగన్ రియాక్షన్‌తో షాక్‌లో రోజా..!
వైకాపా మహిళా విభాగంలో కీలక రోల్ పోషిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి సరైన మద్దతు లభించడం లేదా? రోజా విషయంలో జగన్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం కాలేదా? రెండు రోజుల కిందట జరిగిన పోలీస్ వర్సెస్ రోజా ఎపిసోడ్‌లో జగన్.. రోజాకి ఝలక్ ఇచ్చారా? ఈ నేపథ్యంలో ఇక తన జబర్దస్త్‌కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్నర్ ఎంచుకోవాలని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. […]
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టించాలని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు అండ్ కో కలలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ జిల్లా ప్రజలను ఆకట్టుకోవడం కోసం శతథా శ్రమిస్తున్నప్పటికీ.. బాబు పక్షాన నిలబడే వాళ్లు ఎవరూ కనిపించడం లేదనే పరిస్థితి తాజా పరిణామాలతో స్పష్టమైంది! జగన్ ఇలాకాగా పేరు పడ్డ కడపలో వైకాపా అడ్రస్ లేకుండా చేద్దామని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆయనకు తోడుగా ఆయన అనుచరులు కడప టీడీపీ నేతలు […]
పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా
పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గంలో బలమైన సామాజిక నేతగా ఎదుగుతున్న నాయకుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతునిచ్చి.. వారి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విషయంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని సహించలేక.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు పవన్ ఇచ్చిన ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలాగే పవన్‌ను పక్కన పెట్టడం వెనుక అధినేత జగన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియన్ […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]