వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని […]

ఎస్బీఐ బ్యాంకు ప‌నిగంటల్లో మార్పులు

ఇండియాలోనే అనిపెద్ద బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ వ‌చ్చింది. ఎందుకంటే ఇక‌పై ఎస్‌బీఐ ప‌ని చేసే టైమింగ్స్ మారాయండి. కొవిడ్ కారణంగా ఇప్పుడున్న బ్యాంకు పనివేళల్లో ఇబ్బందులు ఉన్నాయని కొత్త‌గా టైమింగ్స్ ఛేంజ్ చేశారు. కాబ‌ట్టి బ్యాంక్‌కు వెళ్లాలని అనుకునే వారు కొత్త టైమింగ్స్ ముందుగానే తెలుసుకోవడం చాలా బెట‌ర్‌. ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా కొత్త టైమింగ్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉదయం 7 […]

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]

teacher

తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ […]

వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?

దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు. విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు […]

ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవులు ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌..ఎందుకంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెల‌వులుగా ప్ర‌క‌టించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెల‌వు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్ర‌భుత్వం అధికారుల‌కు ఆదేశాలు […]