వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?

April 11, 2021 at 1:29 pm

దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు.

విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు అని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షల్లో మరిన్ని జాగ్రత్తలతో, భౌతికదూరం పాటిస్తూ, మాస్కు తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్నారు. కరోనా కారణంగా సమగ్ర శిక్షణ పర్యవేక్షణ విధానం అమలులో ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో చదివే 1.60 లక్షలమంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసాము అని చెప్పారు. స్కూల్ తరగతి గదులను స్టూడియోలుగా మార్చామని, అన్ని స్మార్ట్‌క్లాస్‌ కేంద్రాలుగా మారాయన్నారు.

వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts