బ్రేకింగ్ : క్వారంటైన్‌లోకి వెళ్లిన వకీల్ సాబ్ పవన్ ఎందుకంటే .. ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. డాక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోనే ఉంటూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

వాస్తవానికి ఏప్రిల్ 12న తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొనాలని ఉంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో ఈ ర్యాలీ లో పాల్గొనడం అనుమానమే అని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అక్కటుకోవడంతో పాటు మంచి ఆదరణ పొందుతున్నాడు. ఇక వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.