గుంటూరుపై జనసేన పట్టు..టీడీపీ ఇరుక్కునట్లే.!

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. మూడు పార్టీలు కలిస్తే వైసీపీకే లాభం. ఎందుకంటే బి‌జే‌పికి ఉన్న యాంటీ..టి‌డి‌పిపై పడుతుంది. సరే ఆ విషయం పక్కన పెడితే..పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు ఏ పార్టీకి దక్కుతాయనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో టి‌డి‌పి పెద్ద పార్టీ కాబట్టి…బి‌జే‌పి-జనసేనలకు ఆ పార్టీ సీట్లు త్యాగం చేయాలి. ప్రధానంగా జనసేనకు ఎక్కువ సీట్లు వదలాలి. […]

గుంటూరు సిటీలో కన్ఫ్యూజన్..టీడీపీలో భారీ పోటీ.!

గుంటూరు నగరం తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి పట్టు పెరిగిన ప్రాంతం. కానీ టి‌డి‌పికి బలం ఉన్నది ఒక గుంటూరు వెస్ట్ లోనే..మళ్ళీ గుంటూరు ఈస్ట్ లో వైసీపీ హవా ఎక్కువ. ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్ లో వైసీపీ హవా ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక 2014 నుంచి గుంటూరు ఈస్ట్ లో వైసీపీ, గుంటూరు వెస్ట్ లో టి‌డి‌పి గెలుస్తూ వస్తున్నాయి. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ రెండుసార్లు […]

 గుంటూరు మంత్రులకు మళ్ళీ ఛాన్స్ లేనట్లే!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బలంతో వైసీపీపై నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..అటు ప్రతిపక్ష టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుండగా, ఇటు జనసేన సైతం బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ సారి వైసీపీ గాలి కష్టమే అని, జగన్ ఇమేజ్ సైతం వైసీపీని గట్టెక్కించడం ఇబ్బందే అని తెలుస్తోంది. ఈ క్రమంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి అంచున ఉన్నారని […]

గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఏ సీటు ఎవరికి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది. సీట్ల కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, తాడికొండ లాంటి సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో తన వారసుడుకు సీటు ఇవ్వాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ […]

గుంటూరు వెస్ట్‌లో కొత్త ట్విస్ట్..టీడీపీ సీటు ఆమెకేనా?

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన స్థానాల్లో గుంటూరు వెస్ట్ కూడా ఒకటి. గుంటూరు నగరంలో ఉన్న ఈ సీటులో గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే టీడీపీ నుంచి మద్దాలి గిరి గెలిచారు. కానీ తర్వాత మద్దాలి వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. అయితే ఈయనకు నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమే […]

గుంటూరు వైసీపీలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు..!

మూడు రాజధానులతో మూడు ప్రణతల్లో రాజకీయంగా పైచేయి సాధించవచ్చనే ప్లాన్ అధికార వైసీపీ వేసిన విషయం తెలిసిందే..అయితే ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో గొడవ లేకుండా అమరావతి రాజధానిగా ఉంటే..మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగినట్లు కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ వల్ల వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది. అది కూడా గుంటూరు జిల్లాలో […]

గుంటూరు వైసీపీలో ట్విస్ట్..సుచరిత ప్లేస్‌లో డొక్కా.?

గుంటూరు వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..ఇప్పటికే రాజధాని అమరావతి అంశం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం లాంటి కారణాల వల్ల…ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ వేగంగా పుంజుకుంటుంది…అటు జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ నడుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాల పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఇప్పటికే ఆమెని క్యాబినెట్ […]

గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?

అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి […]

నో సీట్: ఆ జిల్లాలో భారీ మార్పు?

సరిగ్గా ఆరు అంటే ఆరు నెలలు…ఈ లోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోకపోతే మొహమాటం లేకుండా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్..ఇటీవల వైసీపీ వర్క్ షాపులో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడప గడపకు వెళ్ళడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, వారికి ఇంకో ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోపు వారు ప్రజల దగ్గరకు వెళ్ళి…వారి మద్ధతు పెంచుకోకపోతే…నెక్స్ట్ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, తర్వాత తన మీద అలిగిన ప్రయోజనం లేదని […]