రేవంత్ కామెంట్స్ పై ఇద్దరూ మౌనం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందునుంచీ అంటే పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుంచీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూనే.. కేంద్రం పెద్దలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రేవంత్ మాటలకు, సవాళ్లకు ఇటు కేసీఆర్ సర్కారు కానీ, అటు బీజేపీ కానీ సమాధానం ఇవ్వడం లేదు. హైదరాబాదు శివారులోని కొంపెల్లిలో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ ఇరు పార్టీల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక […]

సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]

మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]

మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]

నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం..!

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రాజకీయ నాయకులు జిల్లాలో పట్టుకోసం పోరాడుతున్నారు. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలసులు బుధవారం అరెస్టు చేశారు.. ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం చౌటుప్పల్ లో  రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.అయితే ఈ అధికారిక కార్యక్రమానికి […]

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?

దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల […]

ఉత్త‌మ్‌కి ప‌ద‌వీ గండ‌మా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ప‌దవీ గండం భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న వాస్తు నియ‌మాలు పాటిస్తున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును న‌మ్మిన విష‌యం తెలిసిందే. వాస్తు భ‌యంతోనే ఆయ‌న బంగారాలంటి స‌చివాల‌యాన్ని త్వ‌ర‌లోనే కూల‌గొట్టి అధునాత‌నంగా నిర్మించుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి వాస్తు భ‌య‌మే ఉత్త‌మ్‌నీ వెంటాడుతోంద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి […]