సజ్జలకు ప్రమోషన్ .. కేబినెట్ మినిస్టర్ గా ఛాన్స్?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి జాక్ పాట్ కొట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సజ్జలకు అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ వ్యవహారం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది. అదేంటి..ప్రతిపక్ష పార్టీ వల్ల మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకోకండి. అసలు విషయమేమంటే.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల ఎప్పుడూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో కడిగి […]

కాంట్రాక్ట్ లెక్చరర్ లకు గుడ్ న్యూస్…!

కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు లేక.. జీతాలు రాక.. వేరే పనులు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు లెక్చరర్ లకు తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల […]

బ్రేకింగ్ : ఆగష్టు 16 నుండి పాఠశాలలు పున:ప్రారంభం..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాఠశాలలు పున:ప్రారంభ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 16 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను పున: ప్రారంభించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆగష్టు 16 ననే మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులను కూడా మొదలు పెట్టాలని అధికారులకు తెలియ చేశారు. ఈ క్రమంలో నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. […]

రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?

వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడంటే..?

తాజాగా ఏపీలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలను తిరిగి పున: ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలియచేసారు. అంతే కాకుండా జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగష్టు నెలలోపు విద్యాసంస్థల్లో పెండింగ్ లోఇంకా పూర్తి అవ్వని నాడు నేడు పనులను అన్ని కూడా పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని […]

కర్ఫ్యూపై జగన్ సంచలన వాఖ్యలు…?

రాష్ట్రంలో మే 5వ తేది నుంచి విధించిన కర్ఫ్యూ ద్వారా ఆ వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా జరిగిన సదస్సులో కొవిడ్, అర్బన్‌ క్లినిక్స్, ఉపాధిహామీ పనులు, ఇళ్లపట్టాలు, ఖరీఫ్‌ సన్నద్ధత లాంటి వాటిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు లాంటివి ఇకపై జీవితంలో […]

కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]

వైఎస్ఆర్ వాహనమిత్రలో కొత్త నిబంధనలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లబ్ధిదారులతో పాటు, కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం పలు నిబంధనలు […]