2019 ఎన్నిక‌ల‌పై బాబు-జ‌గ‌న్‌ల ప‌గ‌టిక‌ల‌లు!

ఏపీలో ఎల‌క్ష‌న్స్‌కి క‌నీసం ఎంత‌లేద‌న్నా మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయినా కూడా అటు అధికార, ఇటు ఏకైక విప‌క్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేసిన‌ట్టు.. తామే అధికారంలోకి వ‌చ్చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున క‌ల‌రింగ్ ఇస్తున్నాయి. దీంతో మామూలు జ‌నానికి పిచ్చి ప‌డుతోంది. విష‌యం ఏంటంటే.. 2014 ఎన్నిక‌లు పూర్త‌యి ఖ‌చ్చితంగా రెండున్న‌రేళ్లు. మ‌రో ఐదేళ్ల‌కు అంటే 2019 ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. అయితే, ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, […]

జ‌గ‌న్‌ను ఎలెర్ట్ చేసిన టీడీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు.. రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ పార్టీలు త‌మ‌ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న వేళ‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీని అధికార ప‌క్షం అలెర్ట్ చేసిందా? ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌లో త‌మ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళిక‌లు ర‌చించేందుకు జ‌గ‌న్ అండ్ కోని టీడీపీ అప్ర‌మ‌త్తం చేసిందా? దీనిని ముందే ప‌సిగ‌ట్టిన అధినేత జ‌గ‌న్.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో ద‌శ‌కు టీడీపీ తెర‌తీసింది. […]

బాల‌య్య కోసం ఒప్పుకున్న కేసీఆర్‌

సినిమాలు.. తెలుగు రాజ‌కీయాల‌కు స‌మైక్యాంధ్ర‌లో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించ‌డంతో ఈ బంధం మ‌రింత ధృడ‌మైంది. అవి నాటి నుంచి నేటి వ‌ర‌కు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజ‌కీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణ‌లో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌ముఖ సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ […]

చంద్ర‌బాబు – జ‌గ‌న్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “

ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం, దాని విధానాల‌పై విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. తాజాగా ఓ విష‌యంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అస‌లు ఆ విష‌యం త‌న‌కు తెలీదు అన్న విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యమే స్టేట్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేప‌డుతున్న ప్ర‌తి ప‌థ‌కం, ప్ర‌తి ప‌నిపైనా వైకాపా అధినేత జ‌గ‌న్‌.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగిపోయింద‌నే ఆరోప‌ణ‌ల‌తో మైకు […]

ఆ ఒక్క స్టెప్‌తో జ‌గ‌న్ చేతిలో చంద్ర‌బాబు బుక్‌

ప్ర‌పంచానికే మేధావిన‌ని, బిల్‌గేట్స్ లాంటి వాళ్ల‌కి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఓ త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి! ఇంకేముంది జ‌గ‌న్ ఊరుకుంటాడా? మ‌రింత‌గా రెచ్చిపోయాడు. బాబు చేసిన త‌ప్పును ఎత్తి చూపుతూ.. ప్ర‌పంచంలో ఇలాంటి వ్య‌క్తి ఇంకెవ‌రైనా ఉంటారా? అంటూ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డాడు. విష‌యంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం […]

బాబు ఇలాకాలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకు రోజూ వ‌ల‌స‌ల షాక్ త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు వైసీపీలో మ‌రో వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి సీఎం అయినా ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీదే పై చేయి అయ్యింది. ఈ క్ర‌మంలోనే చిత్తూరు జిల్లాలో పార్టీలో ఇమ‌డ‌లేని వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికే వ‌రుస‌పెట్టి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ల‌మ‌నేరు నుంచి […]

బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి […]

బీజేపీ నుంచి  సొంత‌గూటికి నాగం జంప్‌..!

బీజేపీ నేత‌, తెలంగాణలో సీనియ‌ర్ పొలిటీషియ‌న్ నాగం జ‌నార్ద‌న రెడ్డి.. పార్టీ మారుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ‌ల్లో నేత‌లు ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వాళ్లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నాగం కూడా త‌న రాజ‌కీయ కెరీర్‌, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. […]

టీడీపీ డ‌బుల్ గేమ్‌

ఏపీ అధికార పార్టీ టీడీపీ మ‌రోసారి డ‌బుల్ గేమ్ పాల‌సీని బ‌య‌ట పెట్టుకుంది. అంటే ఒకే స‌మ‌స్య‌పై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణ‌లో విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయ‌డంలో టీడీపీ నేత‌లు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో విప‌క్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేల‌ను పిలిచి మ‌రీ సైకిల్ ఎక్కించుకోవ‌డాన్ని బాహాటంగా స‌మ‌ర్ధించుకున్న టీడీపీ ఏపీ త‌మ్ముళ్లు.. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల‌కు అక్క‌డి అధికార […]