వ్యూహాలు రచించడంలో తన తర్వాతే ఎవరైనా అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ.. సీనియర్లను పక్కనపెడుతున్నారని మరో వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయిస్తామని చెబుతూ.. వారిని బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం […]
Tag: chandra babu
బాబుకు షాక్:ఏపీ కేబినెట్ ప్రక్షాళన సెగలు రేపడం ఖాయం
ఏపీలో మంత్రివర్గ విస్తరణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుకలుకలు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావరణం అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా లోపల మాత్రం అసంతృప్తి గాలి బుడగలా ఉందని…అది ఎప్పుడైనా ఢాంన పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. 7 గురు మంత్రులను తపించే బాబు కొత్తగా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో సామాజికవర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]
వాళ్ల ఫైటింగ్‌తో బాబుకు నిద్ర పట్టడం లేదా..!
మంత్రి వర్గ విస్తరణ వేళ.. సీఎం చంద్రబాబు సరికొత్త టెన్షన్ మొదలైంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు దక్కవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమా చేరికను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం.. వైసీపీలో చేరవచ్చచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]
బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయన నియోజకవర్గంలోనూ ఆయనపై వ్యతిరేకత అధికమవుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి వెళ్లడంతో రావెలపై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవకాశమిచ్చినా రావెలలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక లోకేష్ కనుసన్నల్లోనే రావెల విధులు నిర్వర్తించేలా […]
ఆ ఇద్దరు మంత్రులు జగన్ గూటికి జంప్ … ఇదే నిదర్శనం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు చెబితే టీడీపీ నేతలు సర్రున ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు! కానీ ఏపీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు జగన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జగన్‌తో టచ్‌లో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జగన్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాచారమే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. […]
టీడీపీలో అన్నదమ్ముల మధ్య ఊహించని పరిణామం
ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీల కోసం అప్పుడే సెగలు రేగాయి. ఎవరికి వారు తమకు ఎమ్మెల్సీ కావాలంటే తమకు ఎమ్మెల్సీ కావాలని పోటీపడుతూ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎమ్మెల్సీ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్. ఎన్ని సమస్యలు ఉన్నా ఆనం బ్రదర్స్ […]
చంద్రబాబుకు మొదలైన 9 ఫీవర్
ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబుకు అన్నీ సమస్యలే! రెవెన్యూ లోటు, కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా ఉద్యమం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వస్తున్న ఆయనకు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భయం పట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబు నాయుడుకి 9 నంబర్‌తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. సీఎం చంద్రబాబుకు నమ్మకాలు ఎక్కువే! […]
ఎంవోయూలతో హోదా ఉద్యమానికి బాబు బ్రేక్
భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం `ఇదీ ఆ సదస్సు ముందు మంత్రులు చెప్పిన మాట! `భాగస్వామ్య సదస్సులో రూ.10.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి` ఇదీ ప్రభుత్వ లెక్క! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి! ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ లెక్కల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉందట. హోదా కోసం యువత విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఉద్యమించిన తర్వాతి […]
బాబు-కేసీఆర్‌లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్‌ది టాక్‌గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]