ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవుల్ని కట్టబెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభిస్తున్న సమయంలో.. గవర్నర్ నరసింహన్ గట్టి షాక్ ఇచ్చారు. తనలో ఉన్న రెండో కోణాన్ని బయటపెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన విషయాన్ని నేతలు మరిచిపోయినా.. తాను మాత్రం మరిచిపోలేదని స్పష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధమని కేకలు, నిరసనలు, విమర్శలు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన […]
Tag: chandra babu
`ఆపరేషన్ జగన్` అధికార పార్టీ వ్యూహం సక్సెస్
అనుకున్నదే అయింది! కథ అడ్డం తిరిగింది! అసలు విషయం పక్కదారి పట్టింది! ఇప్పుడే కాదు ప్రతిసారీ అలానే జరుగుతోంది! ప్రతిపక్ష నాయకుడి వ్యూహం బెడిసికొట్టింది.. విషయం పైకి రాకుండా ప్రతిపక్ష నాయకుడిని కార్నర్ చేయడంలో అధికార పక్షం మరోసారి విజయం సాధించింది! అధికార పక్షం అల్లిన ఉచ్చులో వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుకుపోయారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో దివాకర్ బస్సు ట్రావెల్స్ సంఘటనలో కీలకమైన విషయాలను ప్రజలు పట్టించుకోకుండా.. వారి ఫోకస్ అంతా జగన్‌పై పడేలా […]
చంద్రబాబు ఎఫెక్ట్: ఏపీ మంత్రికి ఘోర అవమానం
ఏపీ క్యాబనెటిలో సీనియర్ మంత్రులలో ఒకరైన రెవెన్యూ శాఖ శాఖ & డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. కీలకమైన డిప్యూటీ సీఎంగాను, రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్న ఆయనకు తెలియకుండా ఆయన శాఖలో నిర్ణయాలు వెలువడిపోతున్నాయి. గతంలో ఆయన శాఖలోని అధికారుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు కేవలం కొద్ది గంటల్లోనే క్యాన్సిల్ అయ్యాయి. లోకేశ్ ఎంట్రీతో కేఈ ఉత్తర్వులు రద్దు చేస్తూ కొత్త […]
చంద్రబాబు తన `ప్రచార స్థాయి` మరో మెట్టుకు .. సందేహం లేదు!
రాష్ట్రానికి ఏ చిన్న అవార్డు దక్కినా అది తన వల్లే అని `ప్రచారం` చేసుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు ఉండరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి మొదలుకుని వృద్ధి రేటు వరకూ అన్నీ తనవల్లే అని గొప్పలు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. వచ్చేది గోరంతయినా.. దానిని కొండంతగా చేసి అందుకు రెండింతలు ప్రచారం చేసుకునే ఆయనకు.. మరో కొత్త లైన్ దొరికింది, సీఎన్‌బీసీ టీవీ 18.. రాష్ట్రానికి `స్టేట్ ఆఫ్ ద ఇయర్` […]
జగన్ ఇలాకాలో సైకిల్ రన్ గ్యారెంటీనా?
దాదాపు 40 ఏళ్లకు పైగా వైఎస్ వంశానికి కంచుకోటగా ఉన్న కడపలో ఇప్పుడు టీడీపీ జెండా ఎగరబోతోందా? చంద్రబాబు ముందుగానే గీసుకున్న స్కెచ్ ప్రకారం జగన్ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టబోతోందా? 2019కి ముందుగానే ఎమ్మెల్సీ రూపంలో జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేయబోతోందా? ఎంతైనా కష్టపడి కడపలో కాలు మోపడం ద్వారా జగన్ కూసాలు కదిలించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది అంటున్నారు టీడీపీ నేతలు.. మంత్రులు. ప్రస్తుతం తెరలేచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు […]
బొత్స ప్లాన్‌తో బాబుకు చెమటలే
ప్రస్తుతం తాను రాజకీయాల్లో యాక్టివ్ లేకపోయినా తానేంటో మరోసారి రుజువుచేశారు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ! వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స పని అంతే అనుకున్న సమయంలో మళ్లీ తెరపైకి వచ్చి తనమార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాకుళం తరఫున విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్లకు ఇచ్చి సీఎం చంద్రబాబు.. తన వ్యూహాన్ని అమలుచేస్తే.. ఇప్పుడు బొత్స […]
అమరావతి టాప్ 5 వెనక అసలు నిజానిజాలు
`అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేయడమే నాలక్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో నిలపడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. అమరావతిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలు, కంపెనీలు, వెడల్పయిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యానవనాలు, అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థ.. ఇలా ఒక్కటేమిటి అన్నీఉంటాయని గాలిలో మేడలు కట్టేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. స్విస్ […]
బాబు ఆయనతో అప్రమత్తం.. కేంద్రం హెచ్చరిక
ప్రముఖ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా.. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రెండు సార్లు పర్యటించి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశీస్సులు అందజేశారు. అమరావతిలో జరిగే కార్యక్రమాలకు దలైలామాను పిలవడం, ఆయనతో బాబు సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంపై కేంద్రం సున్నితంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆయనతో ఆచితూచి వ్యవహరించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిందట. ఇదంతా ఎందుకంటే.. చైనాకు దలైలామా శత్రువు కనుక.. ఏపీతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తే.. ఆ ప్రభావం దేశీయ వాణిజ్యంపై […]
లోకేష్ కోసం ఆయన త్యాగం చేయాల్సిందేనా..!
ఎవరు.. ఆ ఒక్కరు ఎవరు? చినబాబు కోసం మంత్రి పదవి త్యాగం చేసేవారు ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్సీగా పోటీచేయడంతో చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే వారి స్థానంలో కొత్త వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక ఎవరో ఒకరిని ప్రత్యేకంగా తొలగించి తన తనయుడికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే […]