విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
Tag: chandra babu
వెంకన్నను కూడా పట్టించుకోలేనంత బిజీనా బాబూ..!
వరుస సమీక్షలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు.. ఇలా నిత్యం తలమునకలై ఉండే సీఎం చంద్రబాబు.. తిరుమల వేంకటేశ్వరుడి పాలనా వ్యవహారాలు మాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలో తెలియక.. సతమతమవుతున్న ఆయన.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియమించుకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే! ఇదే సమయంలో అథారిటీని కూడా నియమించకుండా కాలయాపన చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. సాక్ష్యాత్తూ […]
ఆ పంచాయితీలతో బాబు ఉక్కిరిబిక్కిరి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి […]
బీజేపీలోకి చంద్రబాబు అనుచరుడు..!
ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రియ శిష్యుడు. చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సదరు పారిశ్రామికవేత్తకు చంద్రబాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. సదరు పారిశ్రామికవేత్త కోసం చంద్రబాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియర్‌ను కూడా వదులుకున్నారు. మరి చంద్రబాబు అంతలా ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణలోని ఖమ్మం […]
ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేపై బాబు నిఘా..!
ఎన్నికలు, కప్పదాట్లు, జంపింగ్ జపాంగ్‌లు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. ఈ మూడేళ్లలో విపక్ష పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. వచ్చే ఎన్నికలకు రెండేళ్లు కూడా టైం లేదు. అయితే వీరంతా ఇప్పుడు ఉన్న అధికార పార్టీల్లోనే ఉంటారా ? అంటే వచ్చే ఎన్నికలకు మరో పార్టీలోకి కూడా జంప్ చేసేందుకు తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారట. ఇక ఏపీలో జనసేన ఎంట్రీతో […]
నంద్యాల టీడీపీలో `ఎవరికి వారే యమునా తీరే’
నంద్యాల ఉప ఎన్నికల అధికార పార్టీ నేతల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్రకటన నాటి నుంచి వరుస విభేదాలు రగులుతున్న వేళ.. అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్రయత్నించాల్సిన చోట `ఎవరికి వారే యమునా తీరే` అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమకు పట్టున్న నియోజకవర్గంలో వేరే వారికి గెలుపు బాధ్యతలు అప్పజెప్పడాన్ని మంత్రి అఖిలప్రియ జీర్ణించుకోలే కపోతున్నారు. తన తండ్రి నియోజకవర్గంలో.. ఇతరుల ప్రమేయంపై తీవ్ర […]
ఆ మంత్రులకు చంద్రబాబు వార్నింగ్ వెనక..!
టీడీపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గతం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో ఎవరికి వారే ఇష్టమొచ్చినట్టు స్వరం పెంచేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వార్నింగ్‌లు కూడా పని చేయడం లేదు. చాలా మంది అయితే చంద్రబాబునే లైట్ తీస్కొంటున్నట్టు కనపడుతోంది. ఎవరో ఒక నాయకుడు నోరు జారడం, అది మీడియాలో హైలెట్ […]
చంద్రబాబుకు ముందు నుయ్యి.. వెనక గొయ్యి
ఏపీ సీఎం చంద్రబాబుకు `రిజర్వేషన్ల` అంశంలో తలనొప్పులు తగ్గేలా కనిపించడం లేదు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్థంలో ఉన్నారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల అంశంపై ఆందోళనలు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్రబాబుకు.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాలలను దగ్గర చేసుకుంటే మాదిగలు దూరమైపోతారు.. అదే సమయంలో మాదిగలను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇతర […]
టీటీడీపీ నేతలతో ఏపీలో పార్టీకి నష్టం
రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఆపరేషణ్ ఆకర్ష్ దెబ్బకు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేతలు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో ఫిరాయింపులపై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నతరుణంలో.. టీటీడీపీ […]