జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూరలో ఓ కరివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ లక్ష్యం ఏంటి ? పవన్‌కు రాజకీయాల్లో రాణించాలన్న క్లారిటీ ఉందా ? లేదా ? పవన్‌కు సినిమాలు ముఖ్యమా ? రాజకీయాలు ముఖ్యమా ? అన్నదే ఇప్పుడు అందరి మదిలోను పెద్ద కన్‌ఫ్యూజన్‌గా మారుతోంది. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా […]
Tag: bjp
కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి
తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కిందట బీజేపీ రథసారథి అమిత్ షా.. తెలంగాణలో మూడు రోజుల పర్యటన చేయడం, భారీ బహిరంగ సభ పెట్టడం, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించడం, కేంద్రం లక్ష కోట్లకు పైగానే తెలంగాణకు సాయం చేసిందని చెప్పడం వంటి పరిణామాల నేపథ్యం.. వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతుండడం వంటి విషయాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ […]
టీడీపీతో బీజేపీ కటీఫ్ తప్పదా?!
ప్రస్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేతలు 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రథసారథి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. అయితే, ఇక్కడ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ పలువురు నేతలు, కార్యకర్తలు షా సభలో, బయటా కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వదిలేద్దాం అని షాకు చెప్పకనే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన […]
చంద్రబాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..
రాష్ట్రంలో రోజుకు 18 గంటలు కష్ట పడుతూ.. తాను పడుకోకుండా.. అధికారులను కూడా పడుకోనివ్వకుండా ఆరు పదుల వయసు దాటి మనవడిని, కుటుంబాన్ని సైతం వదిలి రాష్ట్ర ప్రజల కోసం కష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన బాబు.. తీవ్ర కష్ట నష్టాలు సహా రాజధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో […]
షా కామెంట్లతో మోడీకి కేసీఆర్ ఝలక్!!
పోక చెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత! అచ్చు ఇప్పుడు ఈ సామెతనే ఒంట బట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్. రెండు రోజుల కిందట తెలంగాణలో పర్యటించిన బీజేపీ సారధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయన పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని, అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అయినా ఎక్కడా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నిజానికి తెలంగాణపై ఎవరు ఏ […]
బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడర్లు
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ఒంటబట్టించుకున్న తెలుగు నేలపై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాలన దిశగా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔననే సమాధానం వస్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం అజమాయిషీనే చెల్లుబాటు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్నటికి నిన్న విజయవాడ నడిబొడ్డున బహిరంగ సభ నిర్వహించి కమల దళాధిపతి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]
చంద్రబాబు గ్రాఫ్ తగ్గుతోందా…
ఏపీలో అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ ఒకే వరలో ఇమడని కత్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా కనిపిస్తున్నా రెండు పార్టీల నాయకులు మాత్రం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని బీజేపీ నాయకులు చెపుతున్నారు. బీజేపీకి ఎవరితోను పొత్తులు అక్కర్లేదని..ఏపీకి బీజేపీ ముఖ్యమంత్రే కావాలని బీజేపీలో కొందరు నాయకులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు. ఇక టీడీపీ నాయకులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి […]
ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ కథ.. రాష్ట్రానిది మరో స్టోరీ!!
విభజన అనంతరం ఏర్పడ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉందని, విభజన చట్టం ప్రకారం దీనిని కేంద్రమే పూడ్చాలని పదే పదే లెక్కలు చెప్తూ వస్తోంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామని కొద్దో గొప్పో మాత్రమే బకాయి ఉందని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవరి మాట నమ్మాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుదల చేయాల్సింది మరో రూ. 138 […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్
రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]