‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం టార్గెట్‌ చేసే కిషన్‌ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్‌గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్‌ రెడ్డి కేవలం తన శాఖాపరమైన […]

కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]

గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని […]

లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ..కమలంలో మరో గ్రూప్‌..

తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్‌ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]

హైదరాబాద్ లో కదిలిన ’బండి‘..కమలంలో ఉత్సాహం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసుతన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యకర్తల కోలాహలం మధ్య బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బండి పాదయాత్రకు బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా మంది సీనియర్లు ఆయనకు సహకరించడం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]