’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట. ఇంతకీ ఆ నలుగురు […]

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా. అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]

సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!

కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ […]

కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. […]

జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?

విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]

కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]