అనుష్కకి కష్టాలు

నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]

శాతకర్ణి తల్లి,భార్య,బిడ్డ ఇదిగో

నందమూరి నట సింహం బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొరాకో,జార్జియా ల్లో కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు.భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించాడు అని టాక్. తాజాగా శాతకర్ణి షూటింగ్ లో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని జాయిన్ అయ్యారు.ఇందులో శాతకర్ణికి తల్లిగా హేమమాలిని నటిస్తోంది.ఇక శాతకర్ణి భార్యగా శ్రీయ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ […]

జనతా గ్యారేజ్ TJ రివ్యూ

సినిమా:జ‌న‌తా గ్యారేజ్‌ టాగ్ లైన్:రిపేర్లున్నా అంచనాల్ని అందుకుంది రేటింగ్:3.5/5 థియేటర్:భ్రమరాంబ 70 MM షో:మిడ్ నైట్ బెనిఫిట్ షో బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌ న‌టీన‌టులు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌, మోహ‌న్‌లాల్, సాయికుమార్,బ్రహ్మాజీ, ,బెనర్జీ,అజయ్,ఉన్ని ముకుంద‌న్‌, విదిశ త‌దిత‌రులు నిర్మాత‌లు: మోహ‌న్ చెరుకూరి,న‌వీన్ ఎర్నేని ,య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: తిరు మ్యూజిక్‌: దేవిశ్రీప్ర‌సాద్‌ ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫైట్స్‌: అన‌ల్ అర‌సు ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌ ఎన్నో అంచనాలు..అంతకుమించి సంచలనాల […]

గ్యారేజ్ లో నేనే మెయిన్: నిత్యా

జనతా గ్యారేజ్ సినిమా గురించి నిత్యా మీనన్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య సినిమా ప్రమోషన్ కోసం చాలా ఇంటర్వూస్ ఇచ్చింది నిత్యా. అయితే చాలామంది నిత్యను ప్రత్యేక పాత్రలో నటించారు అని ప్రశ్నించటం తో అసహనం వ్యక్తం చేసిందట. అయితే ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ అదే ప్రశ్న ఎదుర్కొన్న ఈ అమ్మడు.. కాస్తంత ఘాటుగానే స్పందించింది. ప్రతి ఒక్కరూ తనను మెయిన్ హీరోయిన్ కాదంటున్నారని, తానేమీ ప్రత్యేక పాత్రలో చేయడం లేదని, తనదీ ప్రధాన […]

ఎన్టీఆర్ భావోద్వేగం వెనుక…

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ వేదాంతం చెబుతున్నాడు. ఈ మధ్య ఎన్టీఆర్‌ చాలా మారిపోయాడు. తనను తాను మార్చేసుకున్నాడు. అనే వార్తలు వినవస్తున్నాయి. అయితే నిజంగానే ఎన్టీఆర్‌ మారాడట. సినిమా కెరీర్‌లో తాను తిన్న దెబ్బలే తనలోని మార్పుకి కారణమంటున్నాడు. ఏదో ఒక సినిమా చేసేద్దాం, ఎలాగైనా చూసేస్తారన్న ఆలోచనతో సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పాడు. ‘జనతా గ్యారేజ్‌’ విడుదల సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనే ఉద్వేగంగా కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఏ సినిమా ప్రమోషన్‌లోనూ ఎన్టీఆర్‌ ఇంత […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]

నిహారిక కొట్టేసిన బంపర్ ఆఫర్ ఇదే.

చిరంజీవి 150వ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కనిపిస్తారు. నిహారికతో సహా అనే రూమర్స్‌ వచ్చాయి ఇంతవరకూ. అయితే ఈ విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. కానీ మెగా హీరోయిన్‌ నిహారికికు మాత్రం ఈ సినిమాలో క్యారెక్టర్‌ కన్‌ఫామ్‌ అయ్యిందట. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తదుపరి […]

నయనతార పోలిటిక్స్

తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ఎప్పుడు పలు వివాదాలను, ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఆమె అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, పెద్ద హీరోల సినిమాలకు సైతం ప్రమోషన్స్ కి రాకుండా నాదారి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాంటి నయనతార ఈమధ్య తమిళనాట జరిగే రాజకీయ కార్యక్రమాలకు మాత్రం తప్పకుండా హాజరవుతుందట. పైగా ఆ కార్యక్రమాలకి హాజరయ్యేటప్పుడు మోడరన్ డ్రెస్ లలో కాకుండా హుందాతనంగా వుండే రెగ్యులర్ పొలిటికల్ లీడర్స్ వాడే […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అడ్డంకులు తొలగిపోయాయి. పరిపాలనను గాలికొదిలేసి గత నెల రోజులుగా పుష్కరాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన ప్రభుత్వం పాపం అదయ్యాక ఏమి చెయ్యాలో పాలుపోక ఎన్టీఆర్ జనతా గారేజ్ కి ఎలాంటి అడ్డంకులు సృష్టించవచ్చో అని ప్లాన్ చేసింది. స్టార్ హీరోలనగానే బెనిఫిట్ షో లు ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ.దాంట్లో భాగంగానే జనతా గ్యారేజ్ సినిమాకు కూడా కృష్ణా జిల్లాలో బెనిఫిట్ షోలకి అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. బయర్స్ […]